08/2/16 5:58 AM

మంగళవారం చేయాల్సిన ప్రార్థన (5 నిమిషాలలో)

Tuesday-Prayer

మంగళవారం మనకి అన్నీ మంగళకరమైన ఫలితాలు రావాలి అంటే, ఆంజనేయస్వామిని, కుజగ్రహాన్ని ప్రార్థించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. బిజీ లైఫ్ లో ప్రశాంతంగా పడి నిమిషాలు కూర్చుని పూజ చేసే అవకాశం లేని వారికోసం కొరడా.కాం ఒక ప్రత్యామ్నాయం ఆలోచించింది. 5 నిమిషాలలోపే పూర్తయ్యే షార్ట్ వీడియోస్ ద్వారా ప్రతిరోజు చేయవలసిన ప్రార్థన శ్లోకాలను మీకందిస్తోంది.
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సుప్రసిద్ధ జ్యోతిష్యులు, టీవీ మాధ్యమం ద్వారా భక్తుల సందేహాలు తీరుస్తూ, ధర్మమార్గాన్ని సూచిస్తున్న బ్రహ్మశ్రీ డా.కాకునూరి సూర్యనారాయణమూర్తి గారి ద్వారా ఈ అమూల్యమైన, పవిత్రమైన వీడియో లను మీ ముందుకు తెస్తున్నాం.

 

ప్రతిరోజు, ఆ వారాధిపతి అయిన గ్రహాన్ని స్తుతించడం, ఆ రోజు పూజించాల్సిన దైవానికి సంబంధించిన ఒక శ్లోకాన్నిపఠించడం ..ఈ రెండూ 5 నిముషాలలో పూర్తయ్యేలా ఈ వీడియో లు చేసాం.

 

మీరు ఉదయాన్నే లాప్ టాప్ ముందో, డెస్క్ టాప్ ముందో కూర్చుని, లేదా బస్సులోనో కార్లో ఆఫీసుకి వెళ్తూ మీ స్మార్ట్ ఫోన్ లో ఈ వీడియో లని చూసి, శ్రీ సూర్యనారాయణమూర్తి గారితో గొంతుకలిపి ఈ శ్లోకాలని పఠించి భగవంతుని కృపకు పాత్రులు కాగలరు.

 

ఈ రోజు, అంటే మంగళవారం కుజ గ్రహానికి, ఆంజనేయస్వామికి సంబంధించిన శ్లోకాలు ఈ వీడియో లో చూడండి.

Tags : Anjaneya SlokambhakthiHanuman SlokamKujagraha stotramShort prayer for Tuesday

Also read

Use Facebook to Comment on this Post



Menu