08/3/16 6:00 AM

బుధవారం చేయవలసిన ప్రార్థన (5 నిమిషాలలో)

Wednesday-Prayer

నిద్ర లేచిన దగ్గరనుండి పడుకోబోయే వరకు క్షణం తీరికలేకుండా పని. ఈ పని వత్తిడి లో పడి దేవుడికి ఒక్క పది నిమిషాలు ప్రశాంతంగా పూజ చేయలేక పోతున్నాం. మనసులో దేవుడికి పూజ చేయాలని ఉన్నా టైం దొరకని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో.. కొరడా.కాం ఒక సులువైన, శాస్త్రీయమైన ఆలోచన చేసింది. అదే “ప్రార్థన..5 నిమిషాలలో” ..

 

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సుప్రసిద్ధ జ్యోతిష్యులు, టీవీ మాధ్యమం ద్వారా భక్తుల సందేహాలు తీరుస్తూ, ధర్మమార్గాన్ని సూచిస్తున్న బ్రహ్మశ్రీ డా.కాకునూరి సూర్యనారాయణమూర్తి గారి ద్వారా ఈ అమూల్యమైన, పవిత్రమైన వీడియో లను మీ ముందుకు తెస్తున్నాం.

 

ప్రతిరోజు, ఆ వారాధిపతి అయిన గ్రహాన్ని స్తుతించడం, ఆ రోజు పూజించాల్సిన దైవానికి సంబంధించిన ఒక శ్లోకాన్నిపఠించడం ..ఈ రెండూ 5 నిముషాలలో పూర్తయ్యేలా ఈ వీడియో లు చేసాం.

 

మీరు ఉదయాన్నే లాప్ టాప్ ముందో, డెస్క్ టాప్ ముందో కూర్చుని, లేదా బస్సులోనో కార్లో ఆఫీసుకి వెళ్తూ మీ స్మార్ట్ ఫోన్ లో ఈ వీడియో లని చూసి, శ్రీ సూర్యనారాయణమూర్తి గారితో గొంతుకలిపి ఈ శ్లోకాలని పఠించి భగవంతుని కృపకు పాత్రులు కాగలరు.

 

ఈ రోజు, అంటే బుధవారం బుధగ్రహానికి, గణపతికి సంబంధించిన శ్లోకాలు ఈ వీడియో లో చూడండి.

Tags : Budha graha stotramGanapathi slokamGanesha stotramSlokas for WednesdayVinayaka slokam

Use Facebook to Comment on this Post



Menu