07/14/18 2:43 PM

అందువల్లే ఏపీ, తెలంగాణల్లో ఎదగలేకపోయాం అంటున్న అమిత్ షా

Amit-Shah

తెలంగాణలో నిన్న పర్యటించిన అమిత్ షా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. నిన్న నాంపల్లిలో ఉన్న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో  జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పొత్తుల అంశాన్ని కొందరు నాయకులు లేవనెత్తగా..  తెలంగాణలో ఎవరితోనూ పొత్తు ఉండబోదని, కష్టమైనా.. నష్టమైనా  ఒంటరిగానే ముందుకు వెళ్దామని ఆయన  తేల్చి చెప్పారు. పొత్తుల కారణంగానే ఏపీ, తెలంగాణల్లో సొంతంగా ఎదగలేకపోతున్నామని.. ఒకరి మీద ఆధరాపడకుండా ఇకపై ఒంటరిగా  ఎదిగేందుకు ప్రయత్నించాలని ఆయన పార్టీ నాయకులకు హితబోధ చేశారు.  తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుదామని ఆయన  పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని రాష్ట్ర నేతలను కోరారు. రాష్ట్రంలో బలపడేందుకు మరింత దూకుడుగా ముందుకెళ్లాలని.. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టాలని ఆయన సూచించారు.  ఈ సందర్భంగా,  ప్రతీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఓ నిర్ధిష్టమైన ఎన్నికల ప్రణాళిక రూపొందించాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు.  అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ప్రతీ నియోజకవర్గంలో ప్రజాకర్షణ ఉన్న నాయకులను పార్టీలో చేరేందుకు ప్రోత్సహించాలని ఆయన తెలంగాణ రాష్ట్ర నాయకులకు సూచించారు.

Tags : 2019 Electionsamit shahBJPTelanganaTelangana bjp

Also read

Use Facebook to Comment on this Post



Menu