12/4/19 2:16 PM

స్వామి అయ్యప్పపై భార్య అన్నాలెజినోవా అడిగిన ప్రశ్నకు పవన్ కల్యాణ్ సమాధానం ఏంటంటే..

pawan kalyan and anna lezhneva

రాయలసీమ పర్యటనలో భాగంగా తన వాడీ-వేడీ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపుతోన్న  జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని తన పార్టీ కార్యకర్తలు, నాయకులతో పంచుకున్నారు.  తిరుపతిలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశం సందర్భంగా.. శబరిమలలో మహిళల ప్రవేశ విషయంపై ప్రస్తావనకు రాగా.. శబరిమల ఆలయానికి మహిళలు వెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు. ఒక్కో మతానికి.. ఒక్కో ధర్మం ఉంటుందని, దాన్ని అందరూ పాటించాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప గురించి  తన భార్య అన్నా లెజినోవా అడిగిన ప్రశ్నను ఆయన గుర్తుచేసుకున్నారు.

 

శబరిమలకు మహిళలు ఎందుకు వెళ్లకూడదని తన భార్య తనను ప్రశ్నించిందని..దానికి సమాధానంగా,  “నువ్వు చర్చికి వెళ్లినప్పుడు తలపై చీర కొంగును ఎందుకు కప్పుకున్నావు?” అని అడిగానని, దానికి ఆమె, అది తమ సంప్రదాయమని చెప్పిందని అన్నారు. అదే విధంగా, ఒక్కో ధర్మానికి ఒక్కో ఆచారం ఉంటుందని తాను చెప్పానని, శబరిమలలో మూలవిరాట్టు అయ్యప్పస్వామి, అనునిత్యమూ తపస్సులో ఉంటారని.. పైగా ఆయన ఆజన్మబ్రహ్మచారని.. కాబట్టే, మహిళలను ఆయన చూడరని, అందువల్లే మహిళలకు అక్కడ ప్రవేశం లేదని వివరించానని పవన్ తన కార్యకర్తలకు తెలిపారు. కేవలం, భావోద్వేగాలు రెచ్చగొట్టాలని చూస్తున్న కొందరు.. శబరిమలపై కోర్టును ఆశ్రయించారని, అయ్యప్ప ఆలయ వివాదంపై  తన తల్లి అంజనాదేవి కూడా బాధపడ్డారని ఆయన అన్నారు.

Tags : Anna lezenovajanasenapawan kalyanSwamy ayyappa

Also read

Use Facebook to Comment on this Post



Menu