10/14/19 8:38 PM

రిలయన్స్ జియో భారీ మోసం

Big Fraud By Mukesh Ambani, Boycott Jio

జీవిత కాలం ఉచిత వాయిస్ కాల్స్, అన్ లిమిటెడ్ డేటా.. ఎంత సేపైనా మాట్లాడుకోవచ్చు, డేటా వాడుకోవచ్చు. దేనికీ లిమిట్స్ లేవు.. అన్నీ ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. ఇదీ రిలయన్స్ జియో సంస్థ చేసుకున్న పబ్లిసిటీ. అంతా ఫ్రీ నినాదంతో టెలికాం రంగంలో జియో ఓ సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ఏ టెలికాం కంపెనీ ఇవ్వని ఆఫర్లు జియో ఇచ్చింది. తక్కువ ధరకే ఎక్కువ డేటా ఇచ్చింది. ఈ ఆఫర్స్ తో దేశవ్యాప్తంగా చాలామంది వినియోగదారులు జియో నెట్ వర్క్ కి జంప్ అయ్యారు. ఏకంగా జియోకి 35కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. దీంతో ఇతర నెట్ వర్క్ లు తమ దుకాణం సర్దుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యధికమంది మొబైల్ వినియోగదారులు ఉన్న సంస్థగా రిలయన్స్ జియో ఉంది. దేశంలోనే నెంబర్ 1 కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన సంస్థ తిరుగులేకుండా ఉంది.

 

అయితే జియో చేసిన ప్రకటన ఇప్పుడు వినియోగదారులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. జియో మీద వారు సీరియస్ గా ఉన్నారు. నమ్మకద్రోహం చేసిందని రగలిపోతున్నారు. నమ్మించి గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం.. జియో చేసిన ఐయూసీ(ఇంటర్ కనెక్ట్ యూసేజ్) ఛార్జీల ప్రకటన. అంటే.. ఇకపై ఫ్రీ కాల్స్ ఉండవు. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే డబ్బులు కట్టాల్సిందే. సొంత నెట్‌వర్క్ పరిధిలో చేసుకునే కాల్స్‌కు మాత్రమే ఛార్జీలు ఉండవు. జియో నుంచి జియోకు, ల్యాడ్ లైన్స్‌కు, వాట్సాప్ కాల్స్ వంటి వాటికి ఎలాంటి చార్జీలు ఉండవు. ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకునే మొబైల్ వాయిస్ కాల్స్‌కు నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జ్ చేస్తారు. కాల్స్ కోసం రూ. 10 నుంచి టాపప్ ఓచర్లతో రీఛార్జి చేసుకోవాలని జియో ప్రకటించింది.

 

జియో నుంచి ఇతర ఫోన్లకు చేసే వాయిస్ కాల్స్‌కు చార్జీలు వసూలు చేయనున్నట్లు ముకేష్ అంబానీ సంస్థ ప్రకటించడంతో కస్టమర్లు షాక్ తిన్నారు. వారి నోట మాట పడిపోయింది. దీనిపై సోషల్ మీడియాలో వినియోగదారలు ఓ రేంజ్ లో రిలయన్స్ పై తమ వ్యతిరేకతను తెలుపుతున్నారు. జియోని తెగ ట్రోల్ చేస్తున్నారు. బాయ్ కాట్ జియో అనే నినాదాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అన్ని వాయిస్ కాల్స్ ఉచితమంటూ ఉదరగొట్టి.. కస్టమర్లను పెంచుకున్న తర్వాత ఇలా చేయడం మోసమే అంటున్నారు.

 

ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జీల్లో (ఐయూసీ) భాగంగా 6 పైసలు వసూలు చేస్తున్నట్లు జియో వివరణ ఇచ్చింది. ఈ 6 పైసలు చార్జీలకు గానూ కస్టమర్లకు అదనంగా డేటా అందిస్తామని కంపెనీ పేర్కొంది. దీంతో కస్టమర్లకు టారిఫ్ పెరినట్లు భావించొద్దని కోరింది. అయినా.. కస్టమర్లు మాత్రం జియో తమని మోసం చేసిందనే ఫీల్ అవుతున్నారు. నమ్మించి గొంతు కోయడం ఇదే అంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో #BoycottJio అంటూ చిన్న సైజు ఉద్యమాన్నే నడుపుతున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్‌ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. దీన్ని చూస్తుంటే ప్రజలు నెమ్మదిగా జియో నుంచి వేరే నెట్ వర్క్ లకు మారిపోయేలా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

ముకేష్ అంబానీ అంతా పక్కా ప్లాన్ ప్రకారమే మోసం చేశారని కొందరు ఆరోపించారు. జియోని బాయ్ కాట్ చేసి ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ అని బతికిద్దామని మరికొందరు కామెంట్ చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి.. అన్నీ ఫ్రీ..ఫ్రీ.. అంటే.. నమ్మి మోసపోకండి అని కొందరు సూచిస్తున్నారు. ఐయూసీ చార్జీల రూపంలో గత మూడేళ్లలో తాము రూ.13వేల కోట్లు నష్టపోయామని, ఛార్జీలను పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని జియో కోరుతున్నా.. కస్టమర్లు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది పెద్ద స్కామ్ అని.. ఇప్పుడు రిలయన్స్ ముకేష్ అంబానీ అసలు రూపం బయటపడిందని అంటున్నారు. అందుకే.. ఫ్రీ అనే ప్రకటనలకు లొంగకూడదు అంటున్నారు. ఆ తర్వాత ఇదిగో ఇలా చింతించాల్సి వస్తుందని చెబుతున్నారు. మాకొద్దు జియో అని చాలామంది అంటున్నారు.

 

ఇకపోతే.. ఛార్జీలు వసూలు చేయడంలో తప్పు లేదు. కానీ.. ముకేష్ అంబానీ.. సాధారణ వ్యక్తేమీ కాదు.. ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకరు. మన దేశంలో నెంబర్ 1 సంపన్నుడు. లెక్కలేనన్ని ఆస్తులు ఉన్నాయి. అలాంటి వ్యక్తికి.. ఛార్జీలు భరించడం పెద్ద లెక్కేమీ కాదు. పైగా.. వందల రూపాయలు పెట్టి జనాలు రీఛార్జ్ చేసుకుంటున్నారు. అయినా అదనంగా నిమిషానికి 6 పైసలు వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. ఏది ఏమైనా.. జియో మోసం చేసింది అనే ఫీలింగ్ లోనే కస్టమర్లు ఉన్నారు. మరి ఈ పరిణామం.. ముకేష్ అంబానీకి ప్లస్ అవుతుందో, మైనస్ అవుతుందో చూడాలి.

Tags : Airtelboycott jiodatafree callsiuc chargesmukesh ambaniReliance jiovodafone

Also read

Use Facebook to Comment on this PostMenu