02/1/19 12:37 PM

Express Tv ఛైర్మన్ దారుణ హత్య

Express TV MD Chigurupati Jayaram Murderr

పారిశ్రామిక వేత్త, Express Tv ఛైర్మన్, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను మర్డర్ చేసి పారిపోయారు. ఆయన సొంత కారులోనే(AP 16 EG 0620) పోలీసులు డెడ్‌బాడీని గుర్తించారు. జయరాం తలపై గాయాలు ఉండటంతో ఇది హత్య అని పోలీసులు తేల్చారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర జాతీయ రహదారి 65 పక్కన గురువారం(జనవరి3 1) రాత్రి రోడ్డు పక్కన కారు ఆగి ఉంది. అందులో మృతదేహం ఉంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆరా తీయగా చిగురుపాటి జయరాంగా గుర్తించారు. కారు వెనక సీటులో చిగురుపాటి జయరాం డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. కారులో మద్యం సీసాలు ఉన్నాయి. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కారులో మరికొందరు వ్యక్తులు ప్రయాణించినట్టు పోలీసులు గుర్తించారు.

 

చిగురుపాటి జయరాం విజయవాడ కోస్టల్ బ్యాంక్ ప్రమోటర్ కూడా. ఆయనకు ఫార్మా, సీడ్స్, లెన్సెస్ కంపెనీలు ఉన్నాయి. కార్పొరేట్ ఫార్మా కంపెనీలతో జయరాంకు గొడవలు, కోర్టు కేసులు ఉన్నాయి. ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ల తరబడి సాలరీలు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారు. దీనిపై ఉద్యోగులు లేబర్ కోర్టుని ఆశ్రయించారు. లేబర్ కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఉద్యోగులకు జీతాలు ఎగ్గొట్టిన కేసులో జయరాం జైలుకి కూడా వెళ్లొచ్చారు.

 

గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన జయరాం.. ప్రస్తుతం అమెరికా సిటిజన్. అమెరికాలోని ఓ బ్యాంకులో జయరాం భాగస్వామి. సామాన్య కుటుంబంలో పుట్టి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. అమెరికా ఫ్లోరిడాలో జయరాం భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబంలో చాలా గొడవలు ఉన్నాయి. భార్య ఆయనను దూరం పెట్టినట్టు వార్తలు వచ్చాయి. నెలకోసారి అమెరికా నుంచి వచ్చి స్థానిక బిజినెస్‌లు చూసుకుంటారు. రెండు రోజుల క్రితమే జూబ్లిహిల్స్‌లోని తన నివాసం నుంచి ఒంటరిగా కారులో వెళ్లినట్టు వాచ్‌మెన్ చెప్పాడు. జయరాం తల్లి మరణం తర్వాత కుటుంబలో కలహాలు మొదలయ్యాయి. సొంత చెల్లితో చిగురుపాటి జయరాంకు గొడవలు ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్ టీవీ పార్టనర్ భానుతోనూ జయరాంకు విభేదాలు ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్ టీవీ అమ్మేందుకు జయరాం హైదరాబాద్‌కు వచ్చినట్టు సమాచారం.

Image result for చిగురుపాటి జయరాం

కారును తెల్ల రంగు చొక్కా వేసుకున్న వ్యక్తి నడిపినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆదారంగా గుర్తించారు. దాడి చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జయరాం చేతులు నలుపు రంగులోకి మారడంతో విషప్రయోగం జరిగినట్టు పోలీసులు సందేహిస్తున్నారు. తలపై గాయాలను బట్టి కారులో ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నట్లు పోలీసులు అంచనా వేశారు. హైదరాబాద్ నుంచి బెజవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట, చిల్లకల్లు చెక్ పోస్టు సెంటర్లలో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. 48 గంటల్లో మిస్టరీ చేధిస్తామని పోలీసులు చెప్పారు.

Image result for chigurupati jayaram dead body

చిగురుపాటి జయరాం రెండేళ్లుగా ఎక్స్‌ప్రెస్ టీవీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. దీంతో చాలామంది ఉద్యోగులు రోడ్డునపడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్స్‌ప్రెస్ టీవీ ఉద్యోగులు కార్యాలయం ముందు అనేకసార్లు ధర్నాలు, ఆందోళనలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో ఫిర్యాదు చేశారు. లేబర్ కోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు నడుస్తోంది. ఎక్స్‌ప్రెస్ టీవీని కొనేందుకు కొందరు ముందుకు వచ్చినా జయరాం మాత్రం అమ్మకుండా అలాగే మొండిగా వ్యవహరించారని ఉద్యోగులు చెబుతున్నారు. 2014లో ఎక్స్‌ప్రెస్ టీవీని లాంచ్ చేశారు. ఏడాదిన్నర పాటు జీతాలు బాగానే చెల్లించారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం స్టాప్ చేశాడు. వారిని వేధించడం మొదలుపెట్టాడు. చివరకు ఛానెల్ పూర్తిగా మూతబడింది. ఉద్యోగులు జీతాలు, పీఎఫ్ కోసం లేబర్ కోర్టుని ఆశ్రయించడంతో.. కోర్టు ఆదేశాలతో చానెల్ ఆఫీస్‌ని సీజ్ చేశారు. ఏడాదికి పైగా చానెల్ అలా మూతపడి ఉంది. చానెల్‌ను కొనేందుకు ఎంతమంది ముందుకు వచ్చినా జయరాం మాత్రం అంగీకరించేవాడు కాదని ఉద్యోగులు చెబుతున్నారు.

Tags : chigurupati jayaram deadcoastal bank promoterexpresstv chairman chigurupati jairam murderexpresstv md chirgurupati jayaram deathjubilee hills

Also read

Use Facebook to Comment on this Post



Menu