07/17/17 9:16 PM

ఈ పాపకు ఆ పిచ్చి పట్టడానికి కారణం ఎవరు?

Untitled-1 copy

జనాలపై సినిమాల ప్రభావమే కాదు.. సీరియళ్ల ప్రభావం కూడా చాలానే ఉంది. సినిమాలను చూసే కాదు సీరియళ్లను కూడా చూసి పిచ్చోళ్లైపోతున్నారు. ఈ సీరియళ్ల కారణంగా చక్కగా చదువుకోవాల్సిన వయసు పిల్లలు కూడా పాడైపోతున్నారు. ఎంతగా అంటే.. ఏకంగా ఇంట్లో నుంచి పారిపోతున్నారు. హైదరాబాద్ నిజాంపేట్ కు చెందిన 10వ తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి విషయంలో ఇదే జరిగింది. హిందీ సీరియళ్లలో నటించాలనే పిచ్చితో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయింది. ఏకంగా 40 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా అందరిని టెన్షన్ పట్టింది. చివరకు 14 పోలీసులు బృందాలు గాలించగా.. ముంబైలో ఆచూకీ లభించింది.

 

గత నెల 7వ తేదీన కనిపించకుండా పోయిన పూర్ణిమ.. ముంబైలో ఉందని తెలుసుకుని చూసేందుకు  తల్లిదండ్రులు ఎంతో ఆత్రుతగా అక్కడికి వెళ్లారు. అయితే వారికి అక్కడ ఊహించని పరిణామం ఎదురైంది. కూతురు వారికి షాక్ ఇచ్చింది. త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడేందుకు కాదు కదా.. కనీసం చూసేందుకు కూడా పూర్ణిమ ఒప్పుకోలేదు. అంతేకాదు ఇంటికి రానని తెగేసి చెప్పింది. ఏడాదిపాటు తల్లిదండ్రులకు దూరంగానే ఉంటానని, తల్లిదండ్రుల వెంట వెళ్లబోన‌ని స్ప‌ష్టం చేసింది. పూర్ణిమ మాట‌ల‌కు షాక్ అయిన ఆమె తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియ‌క హైదరాబాద్ కి వెనక్కి వచ్చేశారు.

 

గత నెల 7న అదృశ్యమైన పూర్ణిమ ఈ మధ్యకాలంలో తాను ఏం చేశానన్న విషయాన్ని పోలీసులకు వివరించింది. జూన్ 7వ తేదీ నుంచి 15 రోజుల పాటు తాను షిర్డీలో గడిపానని చెప్పుకొచ్చింది. గుడిలోనే తింటూ, అక్కడే కాలం గడిపానని, తనను ఎవరూ ఏమీ అడగలేదని చెప్పింది. ఆపై నటించాలన్న కోరికతో ముంబైకి చేరుకున్నానంది. అంతేకాదు తాను అనాధనని, అనాధాశ్రమం నుంచి వచ్చానని ఆమె అసత్యాలు చెప్పడం చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. తన పేరు మార్చుకుని అవకాశాల కోసం ముంబైలోని ఫిల్మ్ స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగానని, అయితే తనను ఎవరూ పట్టించుకోలేదని పూర్ణిమ వివరించింది.

 

కాగా, యాక్టింగ్ పిచ్చితో పూర్ణిమ తన జీవితాన్నే రిస్క్ లో పెట్టుకుంది. అదృష్టం కొద్దీ ఆమెను దుండగులు కానీ, అక్రమ రవాణా ముఠాలు కానీ గుర్తించలేదు, లేదంటే ఘోరం జరిగిపోయి ఉండేదని పోలీసులు చెబుతున్నారు. పదిహేనేళ్ల బాలిక 40 రోజుల తరువాత క్షేమంగా ఉండటం అదృష్టమని భావించవచ్చని అంటున్నారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉందని, తల్లిదండ్రులు కూడా పిల్లల కోరికలను, వారి తీరును గమనిస్తూ ఉండాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

Tags : actinghyderabadmissing girlMoviesmumbainizampetPoornima saiserials

Also read

Use Facebook to Comment on this Post



Menu