07/13/18 5:09 PM

ఎర్రచందనం స్మగ్లింగ్‌తో కోట్లకు పడగలెత్తిన ‘జబర్దస్త్’ కమెడియన్‌! !

Untitled-1 copy

తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన షో ‘జబర్దస్త్‌’. గత ఐదారేళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులని నిరంతరాయంగా అలరిస్తున్న ‘జబర్దస్త్‌’లో నటిస్తున్న కమెడియన్స్  అంటే తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇంతటి పాపులర్ షోలో నటించిన జబర్దస్త్‌ హరి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో కటకటాల పాలయ్యాడు. వివరాల్లో్కి వెళితే, జబర్దస్త్‌  కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ హరి కొన్నాళ్లుగా శేషాచలం అడవుల్లోనుంచి ఎర్రచందనాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలకు, విదేశాలకు స్మగ్లింగ్ చేస్తూ కోట్లకు పడగలెత్తాడని పోలీసులు నిర్ధారించారు. తమిళనాడు నుంచి కూలీలను శేషాచలం అడవులకు తీసుకువచ్చి, వారి చేత ఎర్రచందనం చెట్లను నరికించి ఆ తర్వాత అత్యంత చాకచక్యంగా జబర్దస్త్‌ హరి ఇతర ప్రాంతాలను స్మగ్లింగ్ చేస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది.  ఈ నేపథ్యంలోనే, పక్కా ఆధారాలతో హరి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై మొత్తం 20 కేసులు నమోదు చేశారు. ఇలా వచ్చిన కోట్లాది రూయాయల డబ్బును వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు.. అతడు పలు సీరియల్స్‌ కు  ఫైనాన్స్ చేశాడని.. షకలక శంకర్ హీరోగా నటించిన ‘శంబోశంకర’ సినిమాకు కూడా అతడు ఫైనాన్స్ అందించాడని సమాచారం.

Tags : jabardasthjabardasth hariRed sandal woodShambo Shankara

Also read

Use Facebook to Comment on this Post



Menu