09/27/17 5:54 PM

అంబాని మెలిక… జియో ఫోన్ ఫ్రీ కాదట

JIO-Mukesh AMBANI

“జస్ట్ 1500 కడితే చాలు ఫోన్ ఫ్రీగా ఇస్తారు, మూడేళ్ళ తర్వాత ఫోన్ రిటర్న్ చేసే మనం చెల్లించిన 1500 తిరిగి ఇచ్చేస్తారు..సూపర్ గా ఉంది ఈ ప్లాన్..అంటూ ఓ ఎగబడి మరీ జియో ఫోన్లకి ఆర్డర్ చేసిన వారికి నిజం నిలకడ మీద తెల్సి షాక్ అవుతున్నారు. జస్ట్ 1500 కడితే ఫోన్ ఇచ్చేస్తారు సరే, ఇక్కడే ఒక కండిషన్ ఉంది ఏడాదికి 1500 చొప్పున మూడేళ్లలో 4500 లకి రీచార్జ్ చేయించుకున్నవారికే ముందు చెల్లించిన 1500 రిటర్న్ చేస్తారట. ఒక వేళ ఏడాదికి 1500 చొప్పున రీచార్జ్ చేసుకోక పోతే జియో కంపెనీ ఫోన్ వాపస్ తీసుకుంటుంది. ముందు కట్టిన 1500 కాకుండా మరో 1500 ప్లస్ GST కూడా కట్టాలి.. మొదటి ఏడాది 1500 రీచార్జ్ చేయించుకుని రెండో ఏడాది మానేస్తే 1000 + GST కట్టాలి. మూడో ఏట రిటర్న్ చేస్తే 500+ GST కట్టాలి. మూడేళ్ళు, ఏడాదికి 1500 చొప్పున మొత్తం 4500 లకి రీచార్జ్ చేయించుకుంటేనే, ఫోన్ తిరిగి ఇచ్చినప్పుడు  మొదట చెల్లించిన 1500 రిటర్న్ చేస్తారట. ఇవీ జియో ఫోన్ పెడుతున్న కండిషన్స్. ఈ 1500 రీచార్జ్ లో ఎంత డేటా ఇస్తారు, ఎంత చౌకగా ఇస్తారు అనేది ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ఒకవేళ ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరి అథారిటీ ) కనుక మరీ కారు చౌకగా డేటా ఇవ్వవద్దు అని ఆర్డర్   పాస్ చేసిందనుకోండి, అప్పుడు అంబానీ పంట పండినట్లే. చౌకగా డేటా ఇచ్చే పనిలేదు, పైగా కోట్లమంది ఫిక్స్డ్ వినియోగదారులు..అంబానీకి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. అదిరిందయ్యా అంబానీ..

Tags : AmbaniFREE DATAJioJIO FREE PHONE SECRETRelianceTRAI

Also read

Use Facebook to Comment on this Post



Menu