04/16/18 9:45 PM

మరోసారి పవన్ ను టార్గెట్ చేసిన కత్తి మహేష్..!

Untitled-1 copy

ప్రస్తుతం తెలుగు సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ వివాదం పెను దుమారాన్ని రేపుతోంది. ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు, జూనియర్ ఆర్టిస్టుల మధ్య చాలా వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇదే విషయంపై ఓ న్యూస్ ఛానల్ చర్చా వేదికలో ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ పాల్గొన్నాడు. కాస్టింగ్ కౌచ్ అంశంపై ఇండస్ట్రీలో ఉన్న మొత్తం అందర్నీ ఏకి పారేశాడు మహేష్. ఇంతగా కాస్టింగ్ కౌచ్ అనే అంశం పై విరుచుకుపడ్డ కత్తి మహేష్ కు సునీత అనే జూనియర్ ఆర్టిస్టు షాక్ ఇచ్చింది. తనపై మహేష్ కత్తి రేప్ అటెంప్ట్ చేశడంటూ బాంబు పేల్చింది.

 

అంతేకాకుండా తనమీద మహేష్ చేసిన రేప్ అటెంప్ట్ కి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది. దీంతో కంగుతిన్న మహేష్ ఆ తర్వాత కోలుకుని ధీటుగానే స్పందించాడు. సునీత తనకు ఫేస్ బుక్ ద్వారా పరిచయమైందని.. ఒకట్రెండు సార్లు కలిశానని.. డబ్బు అవసరమైతే చిన్న చిన్న సాయాలు కూడా చేశానని చెప్పుకొచ్చాడు. అంతే తప్ప ఆమెపై ఎలాంటి రేప్ అటెంప్ట్ చేయలేదన్నాడు. టీవీ ఛానెల్ చర్చలో కూర్చునే ఆమె తనపై రేప్ కేసు పెట్టొచ్చని.. తాను కూడా తోడుగా పోలీస్ స్టేషన్ కు వస్తానని అన్నాడు.

 

నేను దోషి అని తేలితే ఉరికంబం ఎక్కడానికి కూడా సిద్ధమన్నాడు. ఒకవేళ నిర్దోషి అయితే సునీతపై పరువు నష్టం కేసు కచ్చితంగా వేస్తానని తెలిపాడు. సునీత మీద మాత్రమే కాక మెగా ఫ్యామిలీకి చెందిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మీద కూడా కేసు వేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. సునీత వెనుక ఉన్నది పవన్ కళ్యాణ్ అని ఆరోపించాడు. ఓ ఆడదాన్ని ఉసిగొలిపి చేతకాని దద్దమ్మ ఆటలు ఆడుతుంది మెగా కుటుంబం అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు కత్తి మహేష్.

Tags : casting couchchiranjeevijanasenajunior artist sunithaKathi MaheshKatti Maheshkonidela productionspawan kalyanrape attemptsri reddy.Tollywood

Also read

Use Facebook to Comment on this Post



Menu