02/22/17 11:00 AM

అంబాని దెబ్బకు మరోసారి అందరు అబ్బా

Mukesh Ambani Jio Press Meet with Brand New Tariff Plans

 

మొత్తానికి రిలయన్స్ జియో ఉచిత సేవల అంకానికి ఎండ్ కార్డు వేసారు. ఏదో ఒక కారణంతో గత ఆరు నెలలుగా ఇబ్బడి ముబ్బడిగా కనెక్షన్లు ఇస్తూ ఫ్రీ నెట్ అండ్ కాల్స్ కాన్సెప్ట్ తో జనాలను విపరీతంగా ఆకర్షించిన జియో మొత్తానికి ఇకపై వినియోగదారుల నుంచి చార్జీలు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. మార్చ్ 31 వరకు ఫ్రీ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అని చెప్పిన జియో యజామన్యం ఇప్పుడు కూడా అదే మాట మీదే ఉంది. కాని ఆ తర్వాత జియో కస్టమర్లు ఎలాంటి పాక్స్ అందుబాటులో ఉంటాయి అని ముకేష్ అంబాని నిన్న స్వయంగా ప్రకటించారు. కేవలం 99 రూపాయల వన్ టైం మెంబెర్ షిప్ తీసుకుంటే ఏడాది పాటు ఫ్రీ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ అండ్ రోమింగ్ సర్వీస్ ని ఏడాది పాటు ఉచితంగా అందించబోతున్నారు. కాల్ తో పాటు డేటా కావాలి అనుకుంటే మాత్రం నెలకు 303 రూపాయలు చెల్లించి ఇప్పుడు పొందుతున్నట్టే నెలకు 30 GB ఫాస్ట్ డేటా ప్లస్ అన్ లిమిటెడ్ స్లో నెట్ బ్రౌజింగ్ ఆఫర్ ఇస్తోంది, తొలుత లాస్ట్ ఇయర్లో ప్రకటించిన టారిఫ్ కి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు ప్రకటించిన ప్యాకేజీలో చాలా గందరగోళం ఉండటం, ప్లాన్స్ సామాన్యుడికి అందుబాటులో లేవని విమర్శలు రావడంతో ఇప్పుడు రీ డిజైన్ చేసారు.

 

ఇక దీంతో మరోసారి పోటీ కంపనీలకు దిమ్మ దిరిగి బొమ్మ కనపడుతోంది. ఇప్పటికే వోడాఫోన్ కోర్ట్ మెట్లు ఎక్కింది. ట్రాయ్ సైతం రిలయన్స్ కు అనుగుణంగా వ్యవహరిస్తోంది అని ఇప్పటికే ఆరోపణలు కూడా చేస్తోంది. కాని జియో ఇవేవి ఖాతరు చేయటం లేదు. వినియోగదారులను టార్గెట్ చేసి వాళ్ళను పెంచుకుంటూ పోవడమే లక్ష్యంగా పెట్టుకున్న జియో ఇప్పటికే 10 కోట్లకుపైగా చందాదారులను కలిగి ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇది భవిష్యత్తులో మోనోపోలికి దారితీస్తే ఇప్పుడు కస్టమర్ అందుకుంటున్న లాభంకన్నా ఫ్యూచర్ అతను మోసే భారం పదుల రెట్లు అధికంగా ఉంటుంది అంటున్నారు. వోడా ఐడియా లాంటి సంస్థలు ఒక్కటి అయ్యే ఆలోచనలు ఇప్పటికే చేస్తున్నాయి. మార్కెట్లో డేటా రీఛార్జికి సంబంధించి ఈ కంపనీలు ఇప్పటికే తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. జియో స్లోగా ఉంది అని ఎన్ని ఫిర్యాదులు ఉన్నప్పటికీ రోజువారి వాడకానికి కావాల్సిన స్పీడ్ అందులో ఉండటంతో నెట్ కోసం సెకండ్ సింగా వాడుతున్న వాళ్లు కోట్లలో ఉన్నారు. దీనికి ధీటుగా ఆఫర్స్ ని డిజైన్ చేయటం తలకు మించిన భారంగా మారుతోంది కంపనీలకు. కేవలం వంద రూపాయలకు ఏడాది పాటు ఫ్రీ కాల్స్ అని ప్రకటించిన అంబాని త్వరలో డిటిహెచ్ రంగంలోకి కూడా అడుగు పెట్టి ఇలాంటి సెన్సేషన్ ఏదో చేయబోతున్నాడు అని ఇప్పటికే బిజినెస్ సర్కిల్స్ లో హాట్ డిస్కషన్ గా ఉంది.

 

Tags : Brand NewJio RulesJio TariffMind BlowingMobile Telecom Industrymukesh ambaniMukesh Ambani Jiopress meetTariff Plans

Also read

Use Facebook to Comment on this PostMenu