09/26/19 1:08 PM

అసలు.. వేణుమాధవ్ కున్న ఆస్తి ఎంత..?

Minister Pays Venu Madhav Hospital Bills

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా లివర్, కిడ్నీ సమస్యలతో బాధపడిన వేణుమాధవ్.. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. వేణు మృతి ఇండస్ట్రీలో విషాదం నింపింది. చిన్నవయసులోనే వేణుమాధవ్ మరణించడం బాధాకరం అని అంతా వాపోయారు. సినీ, రాజకీయ ప్రముఖులు వేణు మృతికి సంతాపం తెలిపారు. వేణుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 600 సినిమాల్లో వేణుమాధవ్ నటించారు. తనదైన శైలిలో కామెడీతో నవ్వులు పూయించారు. ప్రేకక్షులకు కడుపుబ్బా నవ్వించారు. సినీ పరిశ్రమ మంచి కమెడియన్ ను కోల్పోయిందని వాపోయారు.

 

కాగా, వేణుమాధవ్ కు సంబంధించి ఇప్పుడో అంశం హాట్ టాపిక్ గా మారింది. వేణుమాధవ్ ఆసుపత్రి బిల్లుని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెల్లించారు. అంతేకాదు అంత్యక్రియల కోసం రూ.2లక్షలు ఇచ్చారు. ఇప్పుడీ అంశం ఆసక్తిగా మారింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసుపత్రి బిల్లు చెల్లించడం ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఆయన ఎందుకు చెల్లించారు అని అంతా చర్చించుకుంటున్నారు. వేణుమాధవ్ ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. ఆయనకు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే సందేహిస్తున్నారు. అసలు వేణుమాధవ్ కున్న ఆస్తి ఎంత అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.

 

చాలా రోజులుగా వేణుకి సినిమా అవకాశాలు లేవు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా… మరీ హాస్పిటల్ బిల్లు కట్టలేనంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. వేణుమాధవ్ కుటుంబం మౌలాలిలో సెటిల్ అయ్యింది. అక్కడంతా వేణుమాధవ్ ను మౌలాలి మెగాస్టార్ అని పిలిచేవారట. సినీ పరిశ్రమకి సంబంధించిన వాళ్లంతా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఉంటుంటే … వేణుమాధవ్ మాత్రం మౌలాలి మెగాస్టార్ గా పిలిపించుకోవడానికి ఇష్టపడి మౌలాలీలో సెటిల్ అయ్యాడరని చెబుతారు. తనకు ఎంత ఆస్తి ఉందనే వివరాలను గతంలో ఓసారి మీడియాతో వేణు చెప్పారు. ఆర్థికంగా తనకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. 10 ఎకరాల వ్యవసాయ భూమి, 10 ఇళ్లు ఉన్నాయని అప్పుట్లో చెప్పారు. మరి మంత్రి తలసాని.. వేణుమాధవ్ బిల్ ఎందుకు కట్టినట్లు అని అందరూ ఆలోచిస్తున్నారు.

 

కాగా, వేణుతో తనుకున్న అనుబంధాన్ని మంత్రి తలసాని గుర్తు చేసుకున్నారు. వేణు తమ్ముడు లాంటి వాడని చెప్పారు. చిన్నప్పటి నుంచే వేణుతో తనకు పరిచయం ఉందని, సినిమాల్లోకి రాక ముందు నుంచీ స్నేహం ఉందని వెల్లడించారు. వేణుమాధవ్ తన చుట్టూ ఉన్నవారిని నవ్వించేవాడని చెప్పారు. మొదటి నుంచి వేణుమాధవ్ పడిన కష్టాలు తనకు తెలుసని చెప్పారు. ఇద్దరు పిల్లలను చూస్తూ వేణు మాధవ్ సంతోష పడేవారని, చిన్నవయసులోనే ఆయన మృతి బాధాకరమని వాపోయారు.

 

తలసాని చేసిన సాయం పట్ల కొందరు ఆరా తీసే పనిలో ఉంటే.. మరికొందరు మాత్రం.. మంత్రి తలసానిని మెచ్చుకుంటున్నారు. మీది పెద్ద మనసు అని ప్రశంసించారు. ఆర్థిక సాయం చేయడాన్ని అభినందించారు. సాయం చేస్తామని వారిలో చాలామంది మాటలకు మాత్రమే పరిమితం అవుతారు.. తలసాని లాంటి వాళ్లు మాత్రమే చేతల్లోనూ చూపిస్తారు అని పొగుడుతున్నారు. ఎందుకు చేశారు, వేణుకున్న ఆస్తి ఎంత..? లాంటి ఆరాలు తియ్యడం మానేసి.. మంత్రి తలసానిని అభినందించాలని కొందరు కామెంట్ చేస్తున్నారు.

Tags : comedianfinancial aidfuneralhospital billtalasani srinivas yadavVenu Madhavvenu madhav assets

Also read

Use Facebook to Comment on this Post



Menu