12/12/16 3:45 PM

అదిరిపోయే ఫీచర్స్, అతితక్కువ ధరలో నోకియా స్మార్ట్ ఫోన్స్!

nokia-d1c-mobile

 

ఒకప్పుడు మొబైల్ ఫోన్స్ అంటే ‘నోకియా’నే. సామ్ సంగ్, మోటరోల, LG ఇలా ఎన్నో కంపెనీల ఫోన్స్ మార్కెట్ లో ఉన్నా, మంచి నాణ్యత, తక్కువ ధరతో నోకియా ఒక దశాబ్దం పాటు మొబైల్ రంగాన్ని శాసించింది. నోకియా అనేది భారతీయుల జీవితాల్లో భాగం అయిపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ ల రాకతో నోకియా దెబ్బ తిన్నది. సామ్ సంగ్ ఇచ్చిన టఫ్ కాంపిటీషన్ తట్టుకోలేక నోకియా ఫోన్ల తయారీ ఆగిపోయింది. సాఫ్ట్ వేర్  దిగ్గజం  మైక్రోసాఫ్ట్, నోకియాను కొనుగోలు చేసినా నోకియా దశ మారలేదు. నోకియాను కొని భారీగా నష్టపోయిన మైక్రోసాఫ్ట్, తైవాన్ కంపనీ అయిన ఫాక్స్ కాన్ కి తమ వాటాను అమ్మివేసింది. ఫాక్స్ కాన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ టెక్నాలజీతో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తోంది.

 

Nokia D1C ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి రాబోయే ఫోన్ మోడల్, 2G RAM, 13 MP కెమెరా ఉన్న ఫోన్లను 10 వేలకు, 3G RAM, 16MP కెమెరా ఉన్న ఫోన్లను 13 వేల రూపాయలకి ఇండియన్ మార్కెట్ లో విక్రయించాలని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రెనో 505 జీపీయూ, ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో తయారవుతున్న ఈ ఫోన్ మోడల్ కి నోకియా డీ1సీ అని పేరు పెట్టారు. మార్కెట్ లో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లకి ఉన్న అన్ని ఫీచర్లు, నోకియా బ్రాండ్ కి ఉన్న ఇమేజ్, తక్కువ ధర ఈ మూడు ప్రత్యేకతలతో మళ్ళీ మొబైల్ మార్కెట్ ని శాసించాలని, నోకియా, ఫాక్స్ కాన్ కంపెనీలు పట్టుదలగా ఉన్నాయి. ఈ ఫోన్స్ వచ్చే ఏడాది మార్చి తర్వాత మార్కెట్ లోకి రావచ్చు అని తెలుస్తోంది. నోకియా ప్రవేశంతో మొబైల్ మార్కెట్ లో పోటీ మరింత తీవ్రంకావడం, ధరలు మరింత తగ్గిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags : Nokia D1CNokia D1C Price Nokia D1C SpecificationsNokia D1C Release DatesmartphoneSridhar Nallamothu

Also read

Use Facebook to Comment on this Post



Menu