12/7/17 7:12 PM

ఏబీఎన్ రాధాకృష్ణ చచ్చు తెలివితేటలపై విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్!

pawan kalyan radhakrishna

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ‘కాపు పార్టీ’ గా చిత్రీకరించడంలో అప్పటి మీడియా.. రాజకీయనాయకులు విజయవంతంగా సక్సెస్ అయ్యారని పవన్ కల్యాణ్ రాజమండ్రి సభలో అన్నారు. వాస్తవానికి, కాంగ్రెస్ పార్టీలో ఎక్కువుగా రెడ్లకే సీట్లు ఇస్తుంటారని.. టీడీపీలో ఎక్కువుగా కమ్మలకే ప్రాధాన్యం ఉంటుందని.. కానీ, కాపు పార్టీగా చిత్రించబడిన  ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో 120 మంది బీసీలకు సీట్లు ఇచ్చిందని.. అయినప్పటికీ చిరంజీవి గారు సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోవడంతో ప్రజారాజ్యానికి కాపు ముద్ర వేయడంలో అంతా సక్సెస్ అయ్యారని అన్నారు. ‘మరి మీరు జనసేన కు అలా చేయగలరా.. చేయండి చూద్దాం.. పవన్ కల్యాణ్ ఏం చేస్తాడో చూపిస్తా’.. అని పవన్ ఆవేశంగా అన్నారు.

 

వాస్తవానికి తన మీద కూడా అలాంటి ప్రయోగమే చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతూ.. దానికి ఉదాహరణగా ఆయన ఓ సంఘటన గురించి చెప్పారు. అమరావతికి .. రైతుల భూములు తీసుకోవద్దని చెప్పడానికి వెళ్లినప్పుడు.. ఆ సమయంలో  చుట్టుప్రక్కల ఉండే యువకులు ‘అన్న అన్న’ అని తనతో పాటు తిరిగారని..  ఆ సమయంలో తెలుగు దేశానికి అనుకూలంగా ఉండే ‘ఆంధ్రజ్యోతి’ పేపర్ ఎండీ రాధాకృష్ణ తాను రాసిన  ఓ ఆర్టికల్‌ లో పవన్ కల్యాణ్ చుట్టూ కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన యువత తిరిగారని అసత్యాలు రాశారని ఆయన చెప్పుకొచ్చారు.  ‘రాధాకృష్ణ గారు.. నేను కరీంనగర్‌లో జమ్మికుంటకు వెళ్లానండి.. అక్కడ నాతో నా కులమెక్కడుంది..వరంగల్‌లో  తిరిగినప్పుడు నా చుట్లూ నా కలమెక్కడ ఉంది.. బళ్లారిలో వెళ్లినప్పుడు నా కులమెక్కడ ఉంది’  అని ఆయన రాధాకృష్ణను ప్రశ్నించారు. తనకు అన్ని కులాలు అభిమానులు ఉన్నారని.. తన ఆలోచనలు అభిమానించేవాళ్లు చాలా మంది ఉన్నారని ఆయన అన్నారు.  ఇదే రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ ని 2014 ఎన్నికల్లో తాను టీడీపీని  సపోర్ట్ చేసినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.  వాళ్లకి అనుకూలంగా ఉంటే ఒకలాగ.. వాళ్లకి వ్యతిరేకంగా చిన్న మాట మాట్లాడితే వెంటనే తన కులాన్ని బయటికి తీసుకొచ్చి.. తనను కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై మండిపడ్డారు. తాను చిరంజీవి అంత మెతక మనిషి కాదని.. చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని.. చిరంజీవి ఇంటికి పెద్ద కొడుకని.. తాను ఇంటికి ఆఖరి కొడుకునని.. తనకు పిచ్చ.. మూర్ఖత్వం..  చచ్చిపోయేంత  తెగింపు ఉన్నాయని అన్నారు. ఇంకొకసారి తనను ఎవరైనా ఒకే కులానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తే.. ఎవరెవరి సంస్థల్లో ఎంతెంత మంది కులస్థులు ఉన్నారో.. లిస్ట్ ను బయటపెడతానని ఆయన హెచ్చరించారు. ‘తనను ఓ కులానికే అంటగట్టి  కుల నాయకుడిగా చేద్దామని అనుకుంటే.. మీ ఆఫీస్ బాయ్ నుంచి మీ మేనేజర్లు వరకు మీ సంస్థల్లో ఎంత మంది మీ కులస్థులు ఉన్నారో ప్రజల ముందు బయటపెడతానని ఆయన హెచ్చరించారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసేవాళ్లు ఎంత పెద్ద సంస్థలకు అధిపతులైనా.. ఎంత పెద్ద రాజకీయనాయకులైనా తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Tags : AbnAndhra jyothy radha krishnajanasenapawan kalyanPRAJARAJYAMTDP

Also read

Use Facebook to Comment on this PostMenu