07/26/18 6:37 PM

అందుకే, జగన్మోహన్ రెడ్డి మాటలు పట్టించుకోవడం లేదుః పవన్‌ కల్యాణ్‌

12

రాబోయే తరాలకు మెరుగైన రాజకీయ, సామాజిక వ్యవస్థను అందించాలనే ఉద్దేశంతోనే.. తన జీవితంలో వచ్చే పాతికేళ్లు ప్రజాజీవితానికి అంకితమివ్వాలనుకుంటున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దీని కోసం ఎన్ని కష్టాలు ఎదుర్కోవడానికైనా,  ఎన్ని మాటలు పడటానికైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ సందర్భంగా ఆయన  జగన్మోహన్ రెడ్డి తన పై చేసిన వ్యక్తిగత దాడిని ఆయన ప్రస్తావించారు.

 

” నిన్న కూడా మీరు చూశారు కదా.. జగన్నోహన్ రెడ్డి నన్ను తిడుతున్నారు.. నేను వారిని తిట్టలేక కాదు.  ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి నేను వెళ్లను..దాన్ని రాజకీయా లబ్ధి కోసం నేను వాడను.. నేను మాట్లాడితే పబ్లిక్‌ పాలసీల మీద మాట్లాడతాను.. వాటి మీద రెస్సాండ్ అయితే రెస్పాండ్ అవ్వండి. నేను తిరిగి  చాలా చాలా గట్టిగా అనగలను.. నాకు చాలా బలమైన నోరుంది..గొడవ పెట్టుకోగలను..  దాని వల్ల సమస్యలు పరిష్కారమవుతాయంటే గొడవలు పెట్టుకుంటా? కాకపోతే వ్యక్తిగతమైన మాటలు, వివాదాల వల్ల ప్రజా సమస్యలు పరిష్కారమవ్వవు.  ఏ పరిస్థితుల్లో.. ఎవరి వ్యక్తిగత జీవితాల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారో నీకేం తెలుసు.. ఎన్ని కష్టాలు పడ్డామో.. ఎన్నిబాధల పడ్డామో ఎంత క్షోభలు అనుభవించామో.. మీకేం తెలుసు.. వ్యక్తిగత జీవితంలో ఏయే పరిస్థితుల్లో ఉన్నామో మీకేం తెలుసు.. ఒళ్లు బలిసి.. అహంకారం ఎక్కువయ్యి ఈ పనులు చేయలేదు. నేను చాలా బాధ్యతగా ఉండే వ్యక్తిని.. చిన్నజీవితం నుండి వచ్చాను. ఇవన్నీ వాళ్లకి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే, కామ్‌ గా కూర్చుని.. ఇలాంటి మాటలను పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తున్నాను.. రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటివన్నీ భరించాలి” అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వివిధ కళాశాలల విద్యార్థినులు, స్థానికంగా ఉన్న జనసైనికుల కోసం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు.

Tags : janasenapawan kalyanTDPys jaganYs jagans personal comments on pawan kalyan

Also read

Use Facebook to Comment on this PostMenu