07/13/18 8:28 AM

పవన్‌ కల్యాణ్ కు విజయవంతంగా జరిగిన ఆపరేషన్‌! యాత్రకు కొన్ని రోజులు బ్రేక్‌

Untitled-1 copy

కొన్ని నెలలుగా పవన్ కల్యాణ్ కంటి సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన కొన్ని ఫంక్షన్లకు ఆయన చలువ కలువద్దాలను ధరించి వెళ్లింది  ఈ సమస్య కారణంగానే! ఎట్టకేలకు, పవన్ కల్యాణ్‌ ఈ సమస్య నుంచి బయటపడటానికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. రంజాన్‌కు ముందు అర్థంతరంగా పవన్ తన ఉత్తరాంధ్రకు విరామం ప్రకటించడానికి ప్రధాన కారణాల్లో కంటి సమస్య కూడా ఒకటి! వెళ్లిన చోటల్లా అభిమానులు పూల దండలు వేస్తుండటం.. వాటిల్లో ఉన్న నీరు, పురుగు, పుట్రా..తదితరాలు పలుమార్లు పవన్ కల్యాణ్ కంటిలో పడటంతో పవన్ కల్యాణ్ సమస్య మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో,  కంటి సమస్య ఎప్పటికప్పుడు పెద్దది అవుతుండటంతో రంజాన్ సమయంలో ఆయన ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలోని ‘ఐ’ స్పెషలిస్టులను  సంప్రదించగా.. ఎడమ కంటిలో కురుపు ఉందని.. ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా శస్త్రచికిత్స చేయించుకోవడం మంచిదని వారు సూచించారు. దీంతో, ఉత్తరాంధ్ర షెడ్యూల్ పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్న పవన్ కల్యాణ్‌  బుధవారం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవల ‘రంగస్థలం’ విజయోత్సవ సభలో పవన్ మాట్లాడుతూ తాను చలువ కళ్లద్దాలు పెట్టుకుంటున్నదని స్టైల్ కోసం కాదని, కంటి సమస్యతో బాధపడుతున్నానని తెలిపారు. వెలుతురును చూడడం ఇబ్బందిగా ఉండటం వల్లే కళ్లద్దాలు పెట్టుకుంటున్నట్టు ఆ ఫంక్షన్‌లో ఆయన వెల్లడించారు.

 

ఆపరేషన్ అనంతరం  కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ,  పవన్ కల్యాణ్‌ తూర్పు గోదావరి జిల్లా యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లా టూర్ ముగిసే వరకు తాము పవన్ కల్యాణ్ యాత్రకు భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పడంతో ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఉత్తరాంధ్ర టూర్‌పై పలు సమీక్ష సమావేశాలు నిర్వహించిన అనంతరం తూర్పుగోదావరి జిల్లా బదులు పశ్చిమగోదావరి జిల్లాతో తన యాత్రను ప్రారంభించాలని పవన్ డిసైడ్‌ అయినట్లు సమాచారం.

Tags : ANDHRA PRADESH POLITICSpawan kalyanPawan kalyan eye operationPawan kalyan uttarandhra tour

Also read

Use Facebook to Comment on this Post



Menu