01/22/18 5:40 PM

ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరీ..!

Untitled-1 copy

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉంచిన బంగారు, వజ్రాల నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. హైదరాబాద్ మణికొండలోని పంచవటి కాలనీలో రోజా నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఇంటికి తాళం వేసి ఉంది. దీన్ని గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇంటిని పరిశీలించి, విచారణ చేపట్టారు. కాగా, తెలిసిన వారే దొంగతనానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags : manikondamla rojarobberroja houseysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu