06/14/18 11:30 PM

చంద్రబాబుకు NTV తో డీల్ కుదిరిందా?

news channels

‘ఎన్టీవీ’ కూడా టీడీపీ మీడియాలో చేరిపోయిందా?

 

ఇప్పుడు ఇదే అంశం మీడియా మిత్రుల చర్చల్లో హాట్ టాపిక్‌గా మారింది ! ఇలా, ఆఫ్ ది రికార్డ్‌ చర్చించుకోవడానికి వీరి దగ్గర సహేతుకమైన లాజిక్కే ఉంది. నాలుగు రోజుల క్రితం విజయవాడ వచ్చిన ఎన్టీవీ చౌదరి చంద్రబాబు నివాసంలో ఆయనతో పాటు ఏకంగా గంటన్నర పాటు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ వార్త మీడియా వర్గాల్లో గుప్పుమంటోంది. వాస్తవానికి, 2014 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్‌కు మద్దతుగా ఎన్టీవీ వ్యవహరించింది. జగన్ కు మద్దుతగా అనేక స్టోరీ లు ప్లే చేయడంతో పాటు, అప్పట్లో మార్నింగ్ ప్రైమ్ టైంలో.. అప్పటి ఎన్టీవీ గెస్ట్ ఎడిటర్‌ కొమ్మినేని జగన్‌కు అనుకూలంగా.. టీడీపీ కి వ్యతిరేకంగా చర్చలు జరిపేవారు.

 

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఈ తంతు కొన్నాళ్ల పాటు కొనసాగింది. అయితే, ఇది మరీ శృతిమించిందని టీడీపీ వర్గాలు గగ్గోలు పెట్టడంతో ఈ వ్యవహారంలోకి చినబాబు లోకేష్‌ అప్పట్లో  రంగప్రవేశం చేసి ఏపీలో ఎన్టీవీ చానల్‌ ప్రసారం కాకుండా చేశారు (తెలంగాణలో టీవీ-9, ఏబీఎన్ రాకుండా కేసీఆర్‌ చేసినట్లుగా). దీంతో, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీవీ ప్రసారాలు కొన్ని నెలల పాటు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే.. కొమ్మినేనిని ఎన్టీవీ నుంచి పంపించివేసి.. ఆ తర్వాత చినబాబును ఎలాగోలా ప్రసన్నం చేసుకుని ఏపీలో ఎన్టీవీ ప్రసారాలు మళ్లీ స్టార్ట్ అయ్యేలా ఎన్టీవీ చౌదరి చేసుకోగలిగారు. లోకేష్‌ బాబు దెబ్బకు తనను చేర్చుకోవడానికి మిగతా ఛానళ్లు కూడా దడవడంతో ఆఖరికి వైఎస్ జగన్‌కు చెందిన ‘సాక్షి’ టీవీ ఛానల్‌లో కొమ్మినేని చేరారు.

 

ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే.. ఈ వ్యవహారం తర్వాత నుంచి ఏ పార్టీకి మద్దుతుగా కాకుండా తన ఛానల్‌ను న్యూట్రల్‌ గా నడుపుతున్నారు చౌదరి. అయితే తాజాగా ఎన్నికలకు ఏడాది సమయం ముందు.. చంద్రబాబు తో రహస్యంగా.. ఏకాంతంగా గంటన్నరపాటు  భేటీ కావడం అంటే ఏదో డీల్ కుదిరినట్టేనని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, యల్లో టీవీ ఛానల్స్ గా ముద్రపడ్డ ఏబీఎన్‌, టీవీ-9, టీవీ-5, మహా న్యూస్‌ జాబితాలో ఎన్టీవీ కూడా చేరవచ్చనే అభిప్రాయాన్ని కొంతమంది మీడియా మిత్రులతో పాటు  వైసీపీ వర్గాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి.  ఇదే నిజమైతే, టీడీపీ ‘భజన’ రాబోయే రోజుల్లో ‘ఎన్టీవీ’ లో కూడా ఉధృతంగా జరుగనుందన్నమాట. మరి, ఈ అంశంలో నిజమెంతుందో రాబోయే కొద్ది నెలల్లో తేలిపోతుందిలేండి! మరొక విషయమేమిటంటే, ఇది మీడియా వర్గాల్లో ఆఫ్ ది రికార్డ్ జరుగుతున్న ప్రచారమని పాఠకులు గుర్తుపెట్టుకోవాలి!

Tags : AbnNara Chandrababu Naidunara lokeshntvNtv chaudharyTDPTv-5tv-9ysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu