12/4/19 4:48 PM

నిత్యానందస్వామి..మీ దేశానికి వీసా ఎలా తీసుకోవాలిః అశ్విన్

Ashwin and nithyanada

ఆన్‌లైన్‌లో తరుచు సమకాలీన అంశాలపై  చురుక్కు-చమ్మక్కు లాంటి మాటలతో హాస్యం, పరిహాస్యం చేస్తుంటాడు టీం ఇండియా స్పినర్ రవిచంద్రన్ అశ్విన్. ఈ క్రమంలోనే కైలాస దేశాన్ని ఏర్పాటు చేశానంటూ వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయంపై తన దైన శైలిలో ఆయన స్పందించాడు.

 

కరీబియన్ దీవులలో ఓ దేశమైన ట్రినిడాడ్ అండ్ టుబాగోకు సమీపంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి  ఓ దీవిని కొన్న నిత్యానంద… ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశంగా తన దీవిని పేర్కొన్నారు. ఆ దేశానికి ఒక జెండా, రాజ్యాంగం, అధికారం చిహ్నాన్ని కూడా విడుదల చేశారు. తన దేశంలో ప్రధానితో పాటు చిన్నసైజు కేబినెట్ కూడా ఉందని చెప్పారు. విరాళాలను ఇవ్వడం ద్వారా తన దేశ పౌరసత్వాన్ని పొందవచ్చని తెలిపారు. తన దేశంలో పౌరులందరికీ ఫ్రీ ఫుడ్, ఫ్రీ హెల్త్ కేర్‌, ఫ్రీ ఎడ్యుకేషన్ లభిస్తాయని.. వీటితో పాటు యోగా, ధ్యానం లాంటివి కూడా ఉచితంగా నేర్పిస్తామని నిత్యానంద ప్రకటించారు. వివిధ దేశాలలో అణగారిబడిన హిందువలందరికీ తన దేశం తుది గమ్యస్థామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. ఈ అంశంపై టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సెటైరిక్ గా ట్వీట్ చేశారు. ‘కైలాస దేశానికి వీసా పొందడానికి ప్రొసిజర్ ఏమిటి? వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉందా?’ అని ఎద్దేవా చేశాడు. అశ్విన్ చేసిన ట్వీట్‌ కు అంతే సైటెరికల్ గా అనేక మంది నెట్ జన్లు ‘కైలాస’కు వీసా ఎలా పొందవచ్చో అత్యంత సృజనాత్మకంగా  స్పందించారు.

Tags : KailaasaNithyanandaravichandran ashwin

Also read

Use Facebook to Comment on this Post



Menu