07/13/18 12:16 PM

పీవీ సింధుకు మొండిచెయ్యి చూపిన తెలంగాణ ప్రభుత్వం!

Untitled-1 copy

తనకు అదనపు స్థలం కేటాయించాలంటూ హైదరాబాదీ  స్టార్ షట్లర్ పీవీ సింధు చేసిన అభ్యర్థనను తెలంగాణ ప్రభుత్వం నిర్ద్వందంగా తిరస్కరించింది. ఆమెకు అదనంగా మరో గజం స్థలం కూడా కేటాయించలేమని కేసీఆర్ సర్కార్‌ స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. రియో ఒలింపిక్స్ రజత పతకం సాధించి, దేశం యొక్క ఖ్యాతిని ఇనుమడింపచేసిన పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో హైదరబాద్ జూబ్లీహిల్స్ లో 1000 గజాల స్థలాన్ని కేటాయించింది. మార్కెట్లో దీని విలువ సుమారు 15 కోట్లు. అలాగే దీనితో పాటు మరో 5 కోట్ల నగదును కూడా సింధుకు ప్రభుత్వం అందించింది. అయితే, ఇటీవల తనకు ఇచ్చిన స్థలం ప్రక్కనే ఉన్న సుమారు 400 గజాల స్థలాన్ని కూడా తనకు కేటాయించాలని ఆమె ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.

 

తాజాగా, ఆమె విన్నపాన్ని తెలంగాణ ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా భారీ నజరానాను అందచేసిందిని.. నూతన రాజధాని అమరావతిలో 1,000 గజాల  స్థలం పాటు.. మూడు కోట్ల నగదును.. డిఫ్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని ఆమెకు  ఇచ్చిందని.. ఈ విధంగా రెండురాష్ట్రాల నుంచి భారీగా ప్రయోజనాలను అందుకున్న ఆమెకు ఇక మీదట ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎంవో కార్యాలయం డిసైడ్ అయ్యింది.  అయితే, వాస్తవానికి తన  ప్రాక్టీసుకు అనుకూలంగా ఉండేలా తన ఇంట్లోనే ఓ అధునాతన షటిల్ కోర్ట్‌ను.. ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్ ను సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో పీవీ సింధు ఈ అదనపు స్థలం ప్రపోజల్ ను పెట్టినట్టు తెలుస్తోంది.

Tags : andhra pradesh govt.badmintonPV SINDHUrio olympicsTELANGANA GOVERNMENT

Also read

Use Facebook to Comment on this Post



Menu