12/4/19 1:42 PM

దిశను బ్రతికుండగానే సజీవ దహనం చేశారట.. చర్లపల్లి జవానుతో షాకింగ్ విషయం చెప్పిన ఆరిఫ్‌

rapeeee_5448227_835x547-m

దేశాన్ని అట్టుడుకించిన ‘దిశ’ అత్యాచార ఘటనలో మరో  జీర్ణించుకోలేని నిజం తాజాగా బయటకు వచ్చింది. నిన్నటి దాకా పోలీసులు.. తొలుత దిశను హతమార్చిన తరువాత కాల్చి వేసి ఉంటారని భావించగా, ఇప్పుడామెను అత్యంత దారుణంగా సజీవ దహనం చేశారన్న వాస్తవం వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ముఖ్యుడైన ఆరిఫ్ జైల్లో కాపలాగా ఉన్న జవాను వద్ద ఈ వాస్తవాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. చర్లపల్లి జైల్లో కొందరు జవాన్లు వారితో మాట కలపగా, ప్రధాన నిందితుడు ఆరిఫ్, ఏ మాత్రం భయం-బెరుకు లేకుండా తాము చేసిన దుర్మార్గపు అకృత్యాన్ని పూస గుచ్చినట్టు వివరించాడట.

 

ఫూటుగా మద్యం తాగి ఉన్న తాము తొలత దిశను బలవంతంగా  కాళ్లు, చేతులు పట్టుకుని లాక్కెళ్లామని, ఆమె గట్టిగా కేకలు-పెడబొబ్బలు వేస్తుంటే, ఎవరైనా వింటారన్న భయంతో.. తొలత తమ వద్ద ఉన్న మద్యాన్ని బలవంతంగా నోట్లో పోశామని, అప్పటికే తీవ్ర భయంతో ఉన్న ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పిందని..తదనంతరం  అత్యాచారం చేశామని ఆరిఫ్ చెప్పినట్టు జైలు సిబ్బందిలో ఒకరు  వెల్లడించారు. మద్యం తాగించిన అనంతరం.. తమ చేష్టలతో భయందోళనలకు గురైన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని,  ఆపై బ్రతికి ఉండగానే పెట్రోల్ పోసి తగులబెట్టామని చెప్పాడట.

 

కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులూ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉండగా, వారిని కస్టడీకి ఇచ్చే విషయంలో నేటి ఉదయం 11 గంటల తరువాత షాద్ నగర్ కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే షాద్ నగర్ కోర్టు కు భారీ సంఖ్యలో జనసందోహం చేరుకోగా.. పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. నిందితులను కోర్టుకు తీసుకువస్తే, ప్రజలు వారిపై దాడికి దిగబడే  అవకాశాలు ఉండటంతో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

Tags : DishaDisha rapeNIRBHAYA

Also read

Use Facebook to Comment on this Post



Menu