05/18/18 2:09 PM

ఆ వార్తలు మీడియా అత్యుత్సాహమే.. నేను ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదు: డైరక్టర్ రాజసింహ

Untitled-1 copy

టాలీవుడ్ వర్థమాన సినీ దర్శకుడు, ప్రముఖ మాటల రచయిత అయిన రాజసింహ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తలు నిన్నంతా టాలీవుడ్‌లో సంచలనం సృష్టించాయి. ఈ వార్తలపై తాజాగా ఆయన రియాక్ట్ అయ్యాడు. తాను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడిని కాదని..  తనకు జరిగింది ఒకటైతే.. మీడియా దాన్ని మరోలా ప్రాజెక్ట్ చేసిందని ఆయన వివరణ ఇచ్చుకున్నాడు.

 

తనకు చాలా కాలం నుంచి షుగర్ ఉందని.. ఓ పని నిమిత్తం ముంబైలో ఉన్న తనకు  షుగర్‌ లెవల్స్ బాగా పెరిగిపోయాయని.. దీంతో తాను ఒక్కసారిగా స్పృహ తప్ప పడిపోయనని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే, తన పరిస్థితిని గమనించిన చుట్టుప్రక్కలవాళ్లు తనను ఆస్పత్రిలో చేర్చారని, ప్రస్తుతం తాను కోలుకున్నానని ఆయన తెలిపాడు. మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి అయ్యాక తాను హైదరాబాద్ వస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపాడు. పలు సినిమాలకు మాటల రచయితగా పని చేసిన రాజసింహ సందీప్ కిషన్‌, నిత్యామీనన్ హీరో  హీరోయిన్లుగా నటించిన ‘ఒక్క అమ్మాయి తప్ప’ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఆయనకు అవకాశాలు తగ్గిపోయానని.. దీంతో ఆత్మనూన్యతా భావానికి లోనై ఆయన ముంబైలో ఆత్మహత్య చేసుకున్నాడని.. నిన్నంతా తెలుగు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Tags : Director rajasimhaoka ammayi thappasuicide attemptTollywood

Also read

Use Facebook to Comment on this Post



Menu