04/24/18 10:52 PM

అన్నపూర్ణ స్టూడియోస్‌లో టాలీవుడ్‌ అగ్ర హీరోల సీక్రెట్ సమావేశం!

Untitled-1 copy

టాలీవుడ్ పేరు పత్రిష్టలు మసక బారే విధంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో టాలీవుడ్ హేమాహేమీ హీరోలంతా సమావేశమయ్యారు. మీడియాకు తెలియకుండా అత్యంత గోప్యత మధ్య జరిగిన ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షత వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి వెంకటేష్‌, మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్‌, రాంచరణ్, అల్లు అర్జున్‌, వరుణ్ తేజ్‌, నాగచైతన్య, నాని, అల్లరి నరేష్‌, రామ్‌, సుమంత్‌, జీవిత-రాజశేఖర్‌,నవదీప్‌, లక్ష్మీ ప్రసన్న, సీనియర్ నరేష్‌ తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌, నాగబాబు, బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌, జెమినీ కిరణ్, కేఎల్ నారాయణలు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.

 

మరో వైపు, గత శనివారం పవన్ కల్యాణ్ సూచన మేరకు టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్‌ పై జరుగుతున్న రగడ గురించి చర్చించుందుకు 24 క్రాఫ్ట్స్‌ కు చెందిన సినీ పెద్దలు అన్నపూర్ణ స్టూడియోస్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ రెండు సమావేశాలు ముగిశాక మీడియాతో మాట్లాడటానికి సినీ పెద్దలు ఆసక్తి చూపలేదు. క్యాస్టింగ్ కౌచ్ అంశంతో పాటు తెలుగు సినీ పరిశ్రమ గురించి ఎప్పటికప్పుడు తీవ్రంగా దుష్ఫ్రచారం చేస్తున్న తెలుగు న్యూస్ ఛానళ్లు ను దూరం పెట్టాలనే విషయంపై ఈ సమావేశంలో అగ్రహీరోలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

 

three stars

Tags : allari nareshallu aravindallu arjunchiranjeevijeevithalakshmi prasannamahesh babunaga babunaniNavdeepRajasekharRamramcharansenior nareshTollywoodvenkatesh

Also read

Use Facebook to Comment on this Post



Menu