04/24/18 8:53 PM

క్యాస్టింగ్ కౌచ్ పై మోహన్ బాబు ఎందుకు నోరెత్త లేదంటే!

Untitled-1 copy

సాధారణంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వివాదాలు తలెత్తినప్పుడు మంచు మోహన్ బాబు కచ్చితంగా తన అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అయితే, గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమలో ఇంత రచ్చ జరుగుతున్నా.. క్యాస్టింగ్ కౌచ్ తదితర అంశాలపై ఆయన ఎందుకు స్పందించలేదా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. దీనికి కారణం ఏంటా అని ఆరా తీస్తే ఈ వ్యవహారంపై మాట్లాడాలని ఆయన ఓ దశలో గట్టిగా భావించినప్పటికీ.. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆయన మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది.

 

కొన్నాళ్లుగా మోహన్ బాబు అమెరికాలోనే ఉంటున్నారు. భుజానికి సంబంధించిన మేజర్ మెడికల్ ట్రీట్‌మెంట్ ను ఆయన అక్కడ తీసుకుంటున్నారు. వాస్తవానికి చాలా కాలంగా మోహన్ బాబు రైట్ షోల్డర్ సమస్యతో బాధపడుతున్నారు. అయినప్పటికీ దాన్ని లెక్క చేయకుండా ఆయన ‘గాయత్రి’ సినిమాలో ఫైటింగ్‌లు చేశారు. దీంతో సమస్య మరింత జటిలమై నొప్పి బాగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే, ఆయన  సర్జరీ కచ్చితంగా చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తండ్రికి తోడుగా అమెరికా వెళ్లిన విష్ణు కూడా  ప్ర‌స్తుతం అక్క‌డే ఉన్నారు. దాంతో విష్ణు లేకుండానే ఆయన తాజా సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర‌’ ప్ర‌మోష‌న్ల కార్యక్రమాలను  దర్శకనిర్మాతలు కానిచ్చేస్తున్నారు. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్ర‌గ్యా జైస్వాల్ క‌థానాయికగా న‌టించిగా.. బ్రహ్మానందం కీలక పాత్ర పోషించారు.

Tags : casting couchmanchu vishnumohan babupawan kalyanreson behind mohan babu silencesilencesri reddy.Tollywood

Also read

Use Facebook to Comment on this Post



Menu