06/14/18 2:47 PM

జూనియర్ ఎన్టీఆర్ రెండో సారి తండ్రయ్యాడు! అభయ్‌కు జూనియర్ వచ్చేశాడు

Untitled-1 copy

యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ రెండోసారి తండ్రయ్యాడు. ఆయన భార్య లక్ష్మీప్రణతి ఈ రోజు ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జూ.ఎన్టీఆర్‌ స్వయంగా తన ట్విట్టర్‌ ఖాతాలో తెలియచేశాడు. తన కుటుంబం మరింత పెద్దదయ్యిందని.. తన భార్య  మరోసారి మగబిడ్డకు జన్మనిచ్చిందని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ దంపతులకు తొలి సంతానంగా అభయ్ అనే కుమారుడు 2011 జన్మించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, ఇప్పుడు చిన్నారి అభయ్‌కు ఓ తమ్ముడు పుట్టాడని నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

మరో వైపు, ఈ విషయం తెలిసినప్పటి నుంచి  ఎన్టీఆర్ దంపతులకు టాలీవుడ్ పెద్దలు.. అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తమ అభినందనలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్  కు కంగ్రాట్స్ తెలుపుతూ అనేక రూపాల్లో తమ మెసేజ్‌లు పెడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చిందని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చిన నేపథ్యంలో ఈ విషయాన్ని చాలా మంది డబల్ చెక్ చేసుకుంటున్నారు.

 

Tags : AbhayJr ntr becomes father againJr.NTR

Also read

Use Facebook to Comment on this Post



Menu