12/22/18 12:49 PM

బాబాయ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన అబ్బాయ్

Jr Ntr Speech In NTR Biopic Audio Launch Event

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీస్తున్న సంగతి తెలిసిందే. ‘కథానాయకుడు’ .. ‘మహానాయకుడు’ అనే పేర్లతో రెండు భాగాలుగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు క్రిష్ డైరెక్టర్. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ తొలి భాగం కథానాయకుడు ఆడియో అండ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ డిసెంబర్ 21 సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అతిరథమహారథులు ఈ వేడుకకు తరలివచ్చి సందడి చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

 

ఆ మహామనిషి కుటుంబంలోని ఒక కుటుంబసభ్యుడిగా తాను మాట్లాడటం లేదని, ఒక మహానుభావుడు చేసిన త్యాగాల వల్ల లబ్ధి పొందిన ఒక తెలుగువాడిగా తాను మాట్లాడుతున్నానని ఎన్టీఆర్ అన్నారు. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికీ చెందిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఆ మహానుభావుడి చరిత్రను మా తరానికి, ముందు తరాలకు తీసుకెళ్తున్న బాబాయ్ బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా సరిపోదంటూ భావోద్వేగం చెందారు. ఎన్టీఆర్‌ది ఓ చరిత్ర అని, ఇటువంటి చరిత్రను భావితరాలకు అందిస్తున్నందుకు ఇది విజయం సాధించాలని తాను కోరుకోనని, ఎందుకంటే, ఎన్టీఆర్ విజయం సాధించడం వల్లే ఈ బయోపిక్ మొదలైందని, చరిత్రకు విజయాలు, అపజయాలు ఉండవని, కేవలం చరిత్ర సృష్టించడమే ఉంటుందని ఎన్టీఆర్ చెప్పారు.

 

చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో తాతయ్య గారూ అని సంబోధించిన నేను.. ఆయన గురించి తెలుసుకున్న తరువాత రామారావుగారు, అన్నగారూ అని సంబోధించడం మొదలు పెట్టానని.. ఎందుకంటే ఆయన ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదని… తెలుగు వాడిగా పుట్టిన ప్రతి ఇంటికి, తెలుగు వాడిగా పుట్టిన ప్రతి వ్యక్తికి చెందిన ధృవతార ఎన్టీఆర్ అని యంగ్ టైగర్ ప్రశంసించారు.

 

 

రామారావు గురిచి ఎన్నో కథలు విన్నాను అని, నాన్న, అన్న, బాబాయ్ చాలా చెప్పారని… కానీ, ఆయన గురించి ఎంత విన్నా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుందని యంగ్ టైగర్ అన్నారు. ఆయన ఒక గొప్ప కొడుకే కాదు.. ఒక గొప్ప తండ్రే కాదు.. ఒక గొప్ప నటుడే కాదు.. ఒక గొప్ప నాయకుడే కాదు.. వీటన్నింటి కంటే ముఖ్యం తెలుగు వాళ్లు అని కూడా మనల్ని సంబోధించని రోజుల్లో.. పక్క రాష్ట్రాల పేరుతో మనల్ని పిలుస్తున్న రోజుల్లో.. ఇదిరా తెలుగు వాడి గౌరవం. ఇదిరా తెలుగువాడి పౌరుషం. ఇదిరా తెలుగు వాడి ఖ్యాతి అని తొడకొట్టి ఈ రోజు తెలుగు వాళ్లమని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే.. ఎంతో మంది త్యాగాలు చేశారు అందులో నందమూరి తారకరామారావు గారు ప్రముఖులు అని కితాబిచ్చారు. బాబాయ్ చేసిన ఈ ప్రయత్నానికి ఆయన కన్న ఈ కలకి వెన్నెముకగా ఉన్న దర్శకుడు క్రిష్‌ను ఎంత పొగిడినా తక్కువే అన్నారు.

 

తాతయ్య ఎన్టీఆర్ గురించి చెప్పేంత వయసు, అంతటి అనుభవం తనకు లేదని హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ అన్నారు. ఎన్టీఆర్ నుంచి తాను నేర్చుకున్నది కమిట్‌మెంట్, డెడికేషన్ అని చెప్పారు. తనను ఎంతో గొప్ప నటుడిని చేసి, ఆరాధించిన ప్రజలకు ఏదో ఇవ్వాలని ఎన్టీఆర్ అనుకుని ఎంతో చేశారని అన్నారు. అటువంటి గొప్ప వ్యక్తిపై బయోపిక్ తీయడం ఒక్క తన బాబాయ్‌తో తప్ప ఎవరి వల్ల కాదని అన్నారు. ఇక ఈ బయోపిక్‌లో తన తండ్రి నందమూరి హరికృష్ణ పాత్ర చేయాలని బాబాయ్ బాలకృష్ణ తనను అడిగినప్పుడు.. ఇంత కన్నా అదృష్టమేముంటుందని చెప్పానని అన్నారు. అందుకే, బాబాయ్ ఆ విషయం చెప్పగానే చాలా సంతోష పడ్డానని అన్నారు. తన ఫస్ట్ లుక్ చూసి ‘అచ్చం అన్నయ్యలా ఉన్నావని’ బాబాయ్ చెప్పడంతో ఈ పాత్రను పోషిస్తానన్న నమ్మకం తనకు కలిగిందని కల్యాణ్ రామ్ గుర్తుచేసుకున్నారు. ఈ బయోపిక్‌కు నాలుగు పిల్లర్స్.. ఒకటి నిర్మాత బాబాయ్ బాలకృష్ణ, రెండోది దర్శకుడు క్రిష్, మూడోది సంగీత దర్శకుడు కీరవాణి, డీఓపీ బాబా, నాల్గోది బుర్రా సాయి మాధవ్ అని ప్రశంసించారు.

 

రామారావు ఉద్యోగం మానేసి సినిమాల్లోకి రావడానికి మద్రాసు రైలెక్కడం, రకరకాల పాత్రలు పోషించి, ఆంధ్రుల ఆరాధ్య నటుడిగా ఎదగడం. ప్రజా సేవలో బతకాలనుకుంటున్నాం అంటూ అన్నగారి రాజకీయ ప్రవేశం గురించి చెప్పడం, అసెంబ్లీలో వాదోపవాదాలతో కట్ చేసిన ఎన్టీఆర్ ట్రైలర్ బాగుంది. ట్రైలర్‌లో ఎక్కువ సేపు బాలకృష్ణ, విద్యా బాలన్‌లు మాత్రమే కనిపించినా, సినిమాపై అంచనాలు పెంచేలా కట్ చేసి, మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచాడు దర్శకుడు క్రిష్. నందమూరి అభిమానులతో పాటు, సినీ ప్రియులకు కూడా ఎన్టీఆర్ ట్రైలర్ నచ్చేసింది. 2019 జనవరి 9న మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags : balakrishnajr ntr speechJr.NTRKathanayakudukrishntr biopicntr biopic audio launchntr biopic audio trailer launch eventyoung tiger

Also read

Use Facebook to Comment on this PostMenu