12/3/18 10:53 PM

2.ఓ ప్రభంజనం .. వసూళ్ల సునామీ.. 4 రోజుల్లో 400 కోట్లు

2.O Movie Box Office Collections

సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన 2.ఓ సినిమా భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను అందుకుంటోంది. ఓవరాల్‌గా అన్ని భాషల్లో కలిపి 2.ఓ మూవీ నాలుగు రోజులకు కలిపి రూ.400 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు లైకా ప్రొడక్షన్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇది బ్లాక్ బస్టర్ కాదు. మెగా బ్లాక్ బస్టర్ మూవీ అంటూ ట్వీట్ చేసింది. ఈ మూవీ ఫస్ట్ డేనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.80 కోట్లు వసూలు చేసింది.

 

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.12.53 కోట్లు రాబట్టిన ఈ మూవీ..నాలుగు రోజులకు కాను 33 కోట్ల షేర్‌ వసూలు చేసిందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో రూ.29 కోట్ల షేర్ రాబట్టినట్టు సమాచారం. హిందీ వెర్షన్ విషయానికొస్తే…దాదాపు రూ.100 కోట్ల గ్రాస్…47 కోట్ల షేర్ వసూలు చేసినట్టు ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించాడు.

 

మొత్తానికి గురు, శుక్రవారాల్లో నెమ్మదిగా ఉన్న ‘2.O’ బాక్సాఫీస్ కలెక్షన్స్ శని, ఆది వారాల్లో పుంజుకున్నాయి. ఓవరాల్‌గా 2.0 మూవీ తెలుగులో హిట్టు అనిపించుకోవాలంటే ఇంకా రూ.40 కోట్ల షేర్ రాబట్టాలి.

Tags : 2.o movie box office collections400 croresday 4lyca productionsrajinikanthshankarworld wide

Also read

Use Facebook to Comment on this Post



Menu