11/27/18 12:59 PM

రజనీ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు : శంకర్

2.o Movie Highlights

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్‌ కాంబోలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక మూవీ, ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ 2.ఓ. రోబో తర్వాత వస్తున్న ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు, అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రిలీజ్‌కి కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. హైదరాబాద్‌లోని పార్క్ హయాత్‌‌లో తెలుగు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2.ఓ గురించి, షూటింగ్ సమయంలో తమ అనుభవాల గురించిన రజనీకాంత్, శంకర్, అక్షయ్ కుమార్ పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు.

 

రోబో కంటే ఇంకా ఎక్కువ ఎనర్జీతో 2.ఓ కోసం పనిచేసానని రజనీకాంత్ చెప్పారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు తప్ప షూటింగ్ సమయంలో పెద్దగా ఇబ్బంది పడలేదన్నారు. 1975లో తన తొలి సినిమా అపూర్వ రాగంగళ్ రిలీజ్ కోసం ఎంత ఆత్రుతగా ఎదురుచూసానో, ఇప్పుడు 2.ఓ విడుదల కోసం కూడా అలానే ఎదురుచూస్తున్నానని రజనీ వెల్లడించారు.

 

తెలుగు ప్రెస్‌మీట్‌లో డైరెక్టర్ శంకర్ తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తనకొచ్చిన ఒక ఇమాజినేషనే 2.ఓ‌కి మూలం అని చెప్పిన శంకర్, సినిమా కోసం రజినీ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యలేదని, అక్షయ్ మేకప్ కోసం చాలా కష్టపడ్డాడని చెప్పారు. సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆయన ధీమాగా చెప్పారు. సినిమాని 2డిలో కంటే 3డిలో చూస్తే పదిరెట్లు అద్భుతంగా ఉంటుందన్నారు. మీడియా ఇలాంటి సినిమాలను సపోర్ట్ చేస్తే, మన కంట్రీలో కూడా ఇలాంటి సినిమా చెయ్యొచ్చని, మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేయొచ్చని శంకర్ అన్నారు.

 

శివాజి, రోబో తర్వాత రజనీ, శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్ రూ.550 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags : 2.o moive high lightsAkshay kumarDirector Shankarrajinikanthrobo

Also read

Use Facebook to Comment on this Post



Menu