11/29/18 9:05 PM

2.ఓ సినిమా రివ్యూ

Rajinis 2.O movie review

టైటిల్ : 2.ఓ
జానర్‌ : సైంటిఫిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌
నటీనటులు : రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌, అమీ జాక్సన్‌ తదితరులు
మ్యూజిక్ : ఏఆర్‌ రెహ్మాన్
డైరెక్టర్ : శంకర్‌
ప్రొడ్యూసర్ : సుభాస్కరణ్‌

 

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో టెక్ మాంత్రికుడు శంకర్ రూపొందించిన విజువల్ వండర్ మూవీ ‘2.O’. రజనీకాంత్, అమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 2.ఓ భారీ అంచనాల నడుమ నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. త్రీడీ, 4డీ సౌండ్‌ సిస్టమ్‌, భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఇలాంటి ఎన్నో స్పెషాలిటీస్‌తో వచ్చింది. గతంలో శంకర్, రజనీ కాంబోలో వచ్చిన శివాజీ, రోబో కలెక్షన్ల వర్షం కురిపించాయి. మరి రోబోకు సీక్వెల్‌గా భారత సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కించిన ‘2.ఓ’ సినిమా అంచనాలను అందుకుందా? శంకర్‌ మరోసారి తన విజన్‌తో మ్యాజిక్‌ చేశారా?.. ఇవన్నీ తెలియాలంటే ఓ సారి రివ్యూలోకి వెళ్లాల్సిందే.

 

 

జువల్స్ వండర్ ఎలా ఉంటుంది.. ఇప్పటి వరకు బాహుబలిలో మాత్రమే చూశాం.. ఇప్పుడు మరో మెట్టు ఎక్కింది ఇండియన్ మూవీ. రోబో 2.ఓ తో రజనీ-శంకర్ కాంబినేషన్ అది ప్రూవ్ చేసింది. వావ్ అంటూ అందరూ నోరెళ్లబెట్టే స్థాయిలో 2.ఓని తీర్చిదిద్దాడు శంకర్. అంతర్జాతీయ మీడియా సైతం విజువల్ వండర్ గా కీర్తించింది. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ లైకా ప్రొడక్షన్స్. 400 కోట్లతో మొదలుపెట్టి.. 600 కోట్లతో ఫినిష్ చేశారు. 2.0కి ఇలా అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు. నాలుగేళ్ల ఎదురు చూపులకు తెరదించుతూ 2:29 గంటల స్టోరీతో థియేటర్స్ లో సందడి చేస్తోంది.

 

 

కథ:
ఉన్నట్టుండి సెల్‌ఫోన్లు మాయమవుతుంటాయి. మాట్లాడుతుంటే వారి చేతుల్లోంచి కూడా ఫోన్లు ఎగిరిపోతుంటాయి. అయితే ఈ సమస్య ఎందుకు ఎదురైంది? ఎలా పరిష్కరించాలో ఎవరికీ అంతుపట్టదు. ఈ పరిణామాలకు కారణాలేంటో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతారు. అలా మాయమైపోయిన సెల్‌ఫోన్స్‌ అన్ని కలిసి ఓ సెల్‌ ఫోన్‌ వ్యాపారిని, ఓ మొబైల్‌ నెట్‌వర్క్‌ ఓనర్‌ని దారుణంగా హత్య చేస్తాయి. ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొవటానికి ప్రభుత్వం ఓ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. మిలటరీ సాయంతో సెల్‌ఫోన్‌ దాడిని ఎదుర్కోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించదు. డా.వసీకరణ్‌ (రజనీకాంత్‌) రంగంలోకి దిగి దీన్ని చిట్టి మాత్రమే పరిష్కరించగలడని భావించి.. మళ్లీ దానికి ప్రాణం పోస్తాడు. తిరిగి ప్రాణం పోసుకున్న చిట్టి సాయంతో ఈ విధ్వంసానికి కారణం చనిపోయిన పక్షిరాజా అని తెలుసుకోని ఆ నెగెటివ్‌ ఎనర్జీని బంధించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో వసీకరణ్‌ విజయం సాధించాడా..? అసలు పక్షిరాజా సెల్‌ఫోన్స్‌ను ఎందుకు మాయం చేస్తున్నాడు.? ఎందుకు హత్యలు చేస్తున్నాడు..? ‘2.ఓ’ రావల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అన్నది తెరపై చూడాల్సిందే.

 

 

ఎలా నటించారు అంటే..
నటీనటుల విషయానికొస్తే..ఇప్పటికే శంకర్ తో 2 బ్లాక్ బస్టర్స్ అందుకున్న రజనీకాంత్ 2.0 కోసం మరోసారి శంకర్ తో పెయిర్ అప్ అయ్యాడు. శంకర్ పై రజనీ పెట్టుకున్న నమ్మకం వృధా కాలేదు. వశీకరణ్ పాత్రలో రజనీని సాదాసీదాగా చూపించిన శంకర్.. చిట్టి పాత్రలో మాత్రం ఎవరూ ఊహించని రీతిలో ప్రజెంట్ చేశాడు. క్లైమాక్స్ లో రజనీ మేనరిజమ్స్ ని వాడుకోవడం సినిమాకి బాగా ఉపయోగపడింది. శంకర్ ని నమ్మి..2.0 కోసం రజనీ పెట్టిన ఎఫర్ట్స్ వర్కవుట్ అయ్యాయి. ఇక హీరోయిన్ అమీజాక్సన్ ది లిమిటెడ్ రోల్. పాత్ర పరిధి మేర బాగానే నటించింది. ఈ సినిమాతో సౌత్ ఇండియాకి పరిచయం అయిన బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కెరీర్ కి ఇదొక ప్రత్యేకమైన మైల్ స్టోన్. పక్షిరాజా పాత్రలో అక్షయ్ కుమార్ చూపించిన వేరియేషన్స్.. పలికించిన ఎక్స్ ప్రెషన్స్ కు హ్యాట్సాఫ్. ముసలివాడి పాత్రలోనూ.. పవర్ ఫుల్ విలన్ పాత్రలోనూ అద్భుతంగా నటించి నిజమైన హీరో అనిపించుకున్నాడు అక్షయ్.

 

 

గ్రాఫిక్స్ నిలబెట్టింది:
టెక్నీషియన్స్ విషయానికొస్తే ఊహలకందని ఒక సన్నివేశం చుట్టూ..అల్లినటువంటి కథతో 2.0 లాంటి సినిమాని తెరకెక్కించిన శంకర్ క్రియేటివిటీని ఎంత పొగిడినా తక్కువే. కథ పరంగా ఏం లేకపోయినా త్రీడీకి అనుకూలంగా రాసుకున్న సీన్స్..వాటిని ప్రీవిజువలైజ్ చేసుకుని యాజిటీజ్ గా తెరకెక్కించిన విధానం ఎక్స్ ట్రార్డినరీ అని చెప్పుకోవాలి. తన ప్రతీ సినిమాలో సోషల్ మెసేజ్ స్ట్రాంగ్ గా ప్రజెంట్ చేసే శంకర్ ఈ సినిమాలో కూడా సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలనే విషయాన్ని చాలా బలంగా చెప్పగలిగాడు. ఐ సినిమాతో శంకర్ పని అయిపోయింది అనుకున్న వాళ్లకు 2.0 తో క్లారిటీ ఇచ్చాడు. ఇక ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్. రెహ్మాన్ ఈ సినిమాకి పెద్ద ఎసెట్. పాటలు అవసరం లేని ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అడుగడుగునా.. తన సపోర్ట్ అందించాడు. సినిమాటోగ్రాఫర్..నీరవ్ షా కష్టం.. ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. శంకర్ ఊహించుకున్న విజువల్స్ అన్నింటికీ.. త్రీడీ యాంగిల్స్ తో సహా… తెరపై రిప్రెజెంట్ చేసిన పని విధానం మరోసారి నిరూపించుకున్నాడు. బాహుబలి కి విజువల్ సూపర్ వైజర్ గా పనిచేసిన శ్రీనివాస్ మోహన్..2.0 కి కూడా అదే రేంజ్ ఎఫర్ట్ పెట్టాడు. మిగతా టెక్నీషియన్స్ అందరూ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. అడుగడుగునా భారీ తనం, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, అన్ కాంప్రమైజ్డ్ క్వాలిటీతో ..లైకా ప్రొడక్షన్స సంస్త ఈ సినిమాని నిర్మించింది.

 

 

ఓవరాల్ గా:
హిట్ సినిమా రోబో కి సీక్వెల్ గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి భారీ అంచనాలతో.. అనుకోని పరిస్థితుల్లో సంవత్సరం లేట్ గా రిలీజ్ అయిన 2.0 అద్భుతమైన విజువల్స్ తో స్టన్నింగ్ అనిపించే గ్రాఫికల్ వర్క్ తో ఒక లెజెండరీ అప్పీల్ ఉన్న ఫిల్మ్ గా తెరకెక్కింది. ఖచ్చితంగా ఈ సినిమా 3డీ లో చూసి తీరాల్సిందే. 2 డీలో చూసిన వాళ్లకు, పక్షిరాజా ఎపిసోడ్ కి కనెక్ట్ కాకపోవచ్చు. కానీ ఇండియన్ సినిమా హిస్టరీలో చరిత్ర సృష్టించే సినిమా అవుతుందని అనడంలో సందేహం లేదు.

 

ప్లస్ పాయింట్స్ :
రజనీ, అక్షయ్ నటన
గ్రాఫిక్స్
డైరెక్షన్
సినిమాటోగ్రఫీ

 

మైనస్ పాయింట్స్ :
స్టోరీ ఉండదు

Tags : Akshay kumarDirector ShankarRatingrobo 2.Orobo 2.O movie reviewsuperstar rajinikanth

Also read

Use Facebook to Comment on this PostMenu