Ad

01/13/18 3:22 PM

వైరల్: బాలకృష్ణ పై ఓ సినిమా అభిమాని పోస్ట్

balakrishna

 

బాలకృష్ణ డాన్సులని  ఎగతాళి చేస్తున్న వారిపై , ఓ సినీ అభిమాని (బాలయ్య ఫ్యాన్ కాదు, ఇది మాకు స్పష్టంగా తెలుసు) పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అది మీ కోసం ..

 

నిన్న ఐనాక్స్ లో ఉదయం 9 గంటలకు జైసింహ ఫస్ట్ షోకు వెళ్ళా

నాకు గుర్తుండి ఐనాక్స్ లో బాలయ్య మాస్ సినిమా వేయటం కర్నూల్ లో ఇదే ఫస్ట్ టైం. థర్డ్ ఫ్లోర్ లో ఉన్న స్క్రీన్స్ కు వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నా. ఇంతలో కొంచెం మాసిపోయినట్టు ఉన్న చొక్కా, పంచె కట్టుకున్న ఒకతను వచ్చాడు

“సర్, టికెట్ మీద 1 అని ఉంది, మొదటి అంతస్తుకు పోవాలా”

“లేదయ్యా, 1 అంటే స్క్రీన్ 1. అన్ని మూడో అంతస్తులోనే ఉంటాయి. లిఫ్ట్ లో రా పోదాం”

అప్పటికే లిఫ్ట్ దగ్గర వెయిటింగ్ క్రౌడ్ ఉంది

“వద్దు సర్, నేను మెట్ల మీందే పోతాను”

“టికెట్ బాగానే దొరికిందే”

“లేదు సర్, ఈడ టికెట్లు యాడ అమ్ముతారో కూడా నాకు తెలియదు. పూర్తి గేటు అవతల బయట ఒకతను 200కి ఇస్తాను అన్నాడు. బాలయ్య బాబు సినిమా కదా, ఓ వంద ఎక్కువ పోతే పోయింది అని కొనుకున్నా”

నేను పైకి చేరుకున్న ఐదు నిమషాల తర్వాత పైకి వచ్చాడు. అనుమానం తీరక అన్ని ఫ్లోర్స్ చెక్ చేసుకుంటూ వచ్చాడు.

బాలయ్య బలం ఏంటో మరోసారి అర్థమైంది. ఇలాంటి మాసే. అమాయకత్వం, తెలిసీతెలియనితనం, పుచ్చుకోకపోయినా అవతలివాళ్లకు ఇచ్చి తీరాలి అనే గౌరవం వాళ్ళలో కనిపిస్తుంది.

అందుకే అలాంటి అభిమానులను మెప్పించడం కోసం అరవై ఏళ్ళ వయసులో అంత కష్టపడి బాలయ్య డాన్స్ చేస్తున్నప్పుడు నాకు నవ్వు రాలేదు. చాలా సంతోషమేసింది. డాన్స్ చేయాలంటే ఊరికే నడుచుకుంటూ ఫోజులిస్తూ, తన బదులు కెమెరా మెన్ తోనే డాన్స్ చేయిస్తూ నానా తిప్పలు పడుతూ, యూత్ అని చెప్పుకునే కొందరు స్టార్ హీరోస్ కన్నా బాలయ్య బెటర్ అనిపించాడు.

సినిమా ఎలా ఉంది అనే ప్రశ్నకు సమాధానంగా ఇది పోస్ట్ చేయటం లేదు. ఆ అభిప్రాయం వేరు. దానికి దీనికి లింక్ లేదు.

వాట్స్ అప్ , ఫేస్ బుక్ లో కామెడీ వీడియోల పేరుతో ఆ డాన్స్ బిట్స్ వైరల్ కావడం చూసి ఇది పోస్ట్ చేయాలి అనిపించింది. స్కూల్ కెళ్ళే మనవడున్న వయసులో అంత ఈజ్ తో డాన్స్ చేయటం షేర్ చేసుకున్నంత ఈజీ కాదు.

 

గమనిక: నేను బాలకృష్ణ అభిమానిని కాదు

-శ్రీ రాజ్ రవీంద్రనాథ్

Tags : a film critic response to Balakrishna anti fansJai simhaTroll BalakrishnaTroll Balayya

Also read

Use Facebook to Comment on this Post



Menu