11/2/19 10:49 PM

‘ఆవిరి’ సినిమా రివ్యూ

Aaviri Movie Review

సినిమా : ఆవిరి

 

నటీనటులు : రవిబాబు, నేహా చౌహాన్, ప్రియా వడ్లమాని, హిమజ, భరణి శంకర్, ముక్తార్ ఖాన్, కాశీ విశ్వనాథ్
దర్శకత్వం : రవి బాబు
జానర్ : థ్రిల్లర్, డ్రామా

 

వైవిధ్యమైన కథలతో సినిమాలు చేయడం రవిబాబు శైలి… అందులో భాగంగానే అనసూయ, అవును లాంటి సినిమాలు తీసి మంచి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు ఆవిరి అనే మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రవిబాబు.. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం..

 

కథ:
రాజ్ (రవిబాబు), లీనా (నేహా చౌహాన్) దంపతులు తమ కూతుర్లు శ్రేయ, మున్నిలతో కలిసి ఓ ఇంట్లో ఉంటారు. పెద్ద కూతురు శ్రేయ చనిపోవడం వల్ల ఆ భాద నుండి బయటపడేందుకు మరో ఇంటికి షిఫ్ట్ అవుతారు. కానీ ఆ కొత్త ఇంట్లో మున్ని విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కనిపించని తన అక్కతో మాట్లాడుతూ ఉంటుంది… శ్రేయ ఆత్మగా మారి మున్నీని ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో సడన్ గా మున్ని కనబడకుండా పోతుంది. ఆసలు మున్నీ ఎక్కడికి వెళ్ళింది. శ్రేయ మున్నీతో ఎందుకు అలా చేస్తుంది. ఇందులో జాన్వి అనే పాత్ర ఎవరు ? రాజ్ కి దీనికి సంబంధం ఏంటి అన్నది తెరపైన చూడాలి.

 

ఎలా ఉందంటే:
ఆవిరి సినిమా మొదలవ్వడం మామూలుగానే ఉంటుంది. ఫస్ట్ సీన్‌లోనే చిన్న ఎమోషనల్ టచ్ ఉంది. రాజ్, లీనా వేరే ఇంటికి మారాక ఆత్మ అనే కాన్సెప్ట్ కూడా సినిమాలోకి ఎంటర్ అవుతుంది. ప్లేట్లు, గ్లాసులు గాల్లో ఎగరడం, కుర్చీ జరగడం, తలుపులు తెరుచుకోవడం వంటి సీన్స్‌తో సినిమా నడిచింది. ఆవిరి రూపంలో ఉన్న తన అక్కతో మున్నీ మాట్లాడడం, అసలు మున్నీ ఇలా ఎందుకు చేస్తుందన్న సన్నివేశాలతో సినిమా మొదటి భాగాన్ని నడిపించాడు దర్శకుడు రవిబాబు. మున్నీని అరిచిన ప్రతిసారి రాజ్ పై అటాక్ జరగడం, మున్నీనే చేస్తుందని రాజ్ అనుకోవడం లాంటి సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. సెకండ్ పార్ట్ వచ్చేసరికి మున్నీ కనిపించకపోవడంతో సినిమా అసలు కథ మెయిన్ ట్రాక్ ఎక్కుతుంది. రాజ్ స్నేహితుడు పోలీసాఫీసర్ వినోద్ (ముక్తా ఖాన్), అతని ఫ్రెండ్ డాక్టర్ పవన్ శర్మ (భరణీ శంకర్) కథలోకి ఎంట్రీ అయి మిస్సింగ్ కేసును విచారిస్తున్న సమయంలో తన భార్య లీనానే మున్నీని దాచేసిందని కనిపెట్టడం, రాజ్‌పై లీనా దాడి చేయడం, లీనాలో ఉన్న ఆత్మ జాన్వీది అని తెలుసుకోవడంతో కథ ఇంట్రెస్టెంటిగ్‌గా సాగుతుంది.

 

భరణి పాత్ర కథలోకి రాగానే కథ కొత్త మలుపు తిరుగుతుంది. సీన్స్ అన్నీ బాగున్నాయి. ఇప్పటివరకు ఆత్మలు అనే పాయింట్‌తో తెరకెక్కిన సినిమాల్లో చూపించని ఒక కొత్త పాయింట్ టచ్ చేశాడు రవిబాబు. కొన్ని వందల సినిమాలకు స్క్రీన్ ప్లే అందించిన సత్యానంద్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు. ఆవిరి పేరులో ఉన్నంత ఫ్రెష్‌నెస్ ఈ సినిమాలోనూ కనిపిస్తుంది.

 

నటీనటులు:
సినిమాలో కనిపించేవి కొన్ని పాత్రలు అయినప్పటికీ తెరపైన వారి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మూడు పాత్రలు సినిమాకి ప్రాణం పోసాయి. రాజ్, లీనా, మున్నీల పాత్రలు బాగున్నాయి. రవిబాబు ఎప్పటిలాగే రాజ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆ తర్వాత మున్నీ పాత్రలో శ్రీముక్త బాగా నటించింది. నేహ చౌహాన్ తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన వారు పాత్రల మేరకు ఒకే అనిపించారు.

 

సాంకేతిక విభాగం:
సినిమాకి సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచింది. వైద్య అందించిన మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో భయపెట్టంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

ఈ సినిమాలో నటించిన అందరిలో ఎక్కువ మార్క్స్ వేయించుకుంది నేహా చౌహాన్. ఎమోషన్స్ , హారర్ లాంటి ఎలిమెంట్స్ ఆమె పాత్ర ద్వారా కన్వే అయ్యాయి. ప్రియా వడ్లమాని పాత్ర చిన్నదే అయినా కూడా సినిమాకి కీలకం. ఆమె నటన కూడా బాగానే ఉంది. సినిమాలో అందరికంటే ఆకట్టుకుంది మాత్రం భరణి పాత్ర. ఆత్మ కేస్‌ని ఇన్వెస్టిగేట్ చెయ్యడానికి వచ్చిన భరణి పాత్రకి మంచి అప్లాజ్ వచ్చింది. పరిమిత వనరులతో నిర్మించిన ఈ సినిమాలో రిపీట్ అనిపించే విజువల్స్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు సినిమాటోగ్రాఫర్ సుధాకర్ రెడ్డి. ఓవరాల్ గా హారర్ అండ్ థ్రిల్లర్ అనే అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఆయా జానర్స్‌ని ఇష్టపడేవాళ్ళకి ఓకే అనిపిస్తుంది.

 

రేటింగ్ : 2.5/5

Tags : aaviri moviecinemamovieRatingravi babuREVIEWsoulthrillerTollywood

Also read

Use Facebook to Comment on this Post



Menu