06/14/18 6:52 PM

‘ఒక రాత్రికి ఇంత రేటు’ అంటూ ఆ సీనియర్ నటి ఫోటో ఆ సైట్ లో పెట్టారు..!

Untitled-1 copy

గతంలో తెలుగు సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ విషయంలో పోరాడిన ప్రముఖ నటి అపూర్వ తాజాగా వార్తల్లోకి ఎక్కింది. ఆమె ఫోటోలు ఒక వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసి ఒక రాత్రికి ఇంత రేటు అని ఫిక్స్ చేశారు. దీంతో కంగుతిన్న అపూర్వ  సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం తతంగం గురించి కూపీ లాగారు. తీగ లాగితే డొంక కదిలిందన్న చందంగా ఆన్ లైన్ మాధ్యమంగా మాజీ ప్రిన్సిపాల్ చొక్కారపు గణేష్ చేస్తున్న అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.

 

కాల్‌ గర్ల్స్‌ అంటూ హీరోయిన్ల ఫోటోలను వెబ్‌ సైట్‌ లో అప్‌ లోడ్‌ చేశాడు గణేష్. ఒక్కో హీరోయిన్‌ కు…ఒక్కో రేటు ఫిక్స్‌ చేశాడు. గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక గణేష్ పెట్టిన పోస్టింగ్స్ లో కేవలం హీరోయిన్ల ఫొటోలు మాత్రమే కాకుండా, కొంతమంది కాలేజీ అమ్మాయిల చిత్రాలు కూడా ఉండటంతో, అవి ఎవరివన్న కోణంలోనూ పోలీసులు విచారణ ప్రారంభించారు.

 

అయితే పోలీసుల విచారణకు కొద్ది నిమిషాల ముందు గణేష్ ‘లొకాంటో’ వెబ్ సైట్ లో తాను పెట్టిన పోస్టింగ్స్, చిత్రాలన్నింటినీ డిలీట్ చేశాడని, ఇప్పుడు వాటిని రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు.

Tags : Apoorva name in dating websiteappoorvaGaneshPolice

Also read

Use Facebook to Comment on this Post



Menu