05/6/19 7:21 PM

నటి సురేఖా వాణి ఇంట్లో విషాదం

Actress Surekha Vani Husand Dies

ప్రముఖ నటి సురేఖా వాణి భర్త సురేష్ తేజ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం ఉదయం మరణించారు. తేజ, వాణిలది లవ్ మ్యారేజ్. సురేష్ అనేక తెలుగు టీవీ ప్రొగ్రామ్స్, టీవీ షోలకు డైరెక్టర్‌గా పనిచేశారు. సురేఖ టీవీ యాంకర్‌గా ఉన్న సమయంలోనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ వంటి టీవీ షోలు సురేష్ తేజ డైరెక్ట్ చేశారు. ఈ ప్రొగ్రామ్స్‌కు సురేఖ వాణి యాంకర్‌గా వ్యవహరించారు. సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఛాన‌ల్ ప్రోగ్రామింగ్ హెడ్‌గా పనిచేస్తున్నారు.

 

సురేష్ మృతి పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ నటులు, సీరియల్ యాక్టర్స్ సురేఖా వాణి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సురేఖా వాణి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు చేసి మెప్పించారు.

Tags :

Also read

Use Facebook to Comment on this PostMenu