01/11/18 6:54 PM

అజ్ఞాతవాసి మూవీ రిజల్ట్ తర్వాత బాలయ్య సినిమా నిర్మాత ఫోన్ మోగుతూనే ఉందట..!

Untitled-1 copy

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మాత సి.కల్యాణ్ నిర్మిస్తున్న ‘జై సింహ’ మీద  అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న విడుదల చేయడానికి నిర్మాత ఎంతో కృషి చేస్తున్నారు.

 

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంక్రాంతి హీరో అని నందమూరి బాలకృష్ణకు మంచి పేరు ఉంది. ఈ సెంటిమెంట్ ను ఆధారం చేసుకొని నిర్మాత సి.కళ్యాణ్ సినిమా హిట్టవుతుంది అనే ధీమాలో ఉన్నారు. అందుకే సినిమా మొత్తం ఆయనే విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ  బిజినెస్ బాగానే జరిగింది.. సినిమాకి ఏ మాత్రం మంచి రెస్పాన్ వచ్చినా సినిమాను ఆపలేము అంటున్నారు సినీ ప్రేమికులు. ఇక శాటిలైట్ హక్కులు ఇతర భాషల్లో డబ్బింగ్ వర్షన్ వంటివి కలిపి జై సింహ బానే వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలంటున్నాయి.

 

ఈ క్రమంలో ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా జై సింహ బాలకృష్ణ కెరియర్ లో బ్లాక్ బస్టర్ నమోదు చేసుకుంటుందని ఫిలింనగర్ టాక్. ఇప్పటికే విడుదలై అజ్ఞాతవాసి చేతులెత్తేసింది. ఈ క్రమంలో బాలకృష్ణ హిట్టు కొట్టాడంటే ఈ సంక్రాంతి బాలకృష్ణ సంక్రాంతి అవుతుందని చాలామంది అంటున్నారు. ఈ సందర్భంగా ఏ మాత్రం అంచనాలు లేకుండా సంక్రాంతి బరిలో దిగుతున్న జై సింహ ఏం చేస్తుందో చూడాలి మరి.

 

మరొక పక్క నందమూరి ఫాన్స్ మాత్రం ప్రొడ్యూసర్ కళ్యాణ్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అని వినికిడి. కళ్యాణ్ కి ఫోన్ ల మీద ఫోన్ లు చేసి అజ్ఞాత వాసి ప్లాప్ అయ్యింది కాబట్టి ఈ సినిమాకి గట్టిగా ప్రమోట్ చేస్తే సంక్రాంతి తమదే అంటూ నందమూరి ఫాన్స్ ఆయన మీద ఫోర్స్ తెస్తున్నారట. ఇప్పటి వరకూ సైలెంట్ గా సంక్రాంతి కి త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ ఇస్తాడు, బాలయ్య కి ఛాన్స్ లేదు అనుకున్న అభిమానులు ఇప్పుడు మాత్రం సూపర్ ఛాన్స్ దొరకడం తో ప్రొడ్యూసర్ కళ్యాణ్ ఫోన్ మోగుతూనే ఉందట..

Tags : Agnyaathavaasiagnyaathavaasi movie effectbalayya fansJai simhanandamuri balakrishnapawan kalyanphone ringingproducer c.kalyan

Also read

Use Facebook to Comment on this Post



Menu