06/14/18 5:32 PM

వంద కోట్ల భారీ బడ్జెట్…క్లాసికల్ డైరెక్టర్ అల్లు అర్జున్ హీరో..?

Untitled-1 copy

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘నా పేరు సూర్య’ సినిమా భయంకరమైన ఫ్లాప్ అవడంతో అల్లు అర్జున్ తన తర్వాత సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే బన్నీకి చాలా మంది డైరెక్టర్లు స్టోరీలు వినిపించారు. అయితే ఏ ఒక్కరికి ఇప్పటివరకు సిగ్నల్ ఇవ్వలేదు బన్నీ. తాజాగా ప్రముఖ క్లాసికల్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వం లో సినిమా చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

 

గతంలో విక్రమ్ కుమార్ ‘ఇష్క్, మనం, 24’ చిత్రాలతో ప్రేక్షకులను నటించడం జరిగింది. అయితే నా పేరు సూర్య సినిమా తర్వాత అల్లు అర్జున్ కి  చాలామంది డైరెక్టర్లు ఎన్ని కథలు చెప్పినా ఓకే చెప్పలేదు. విక్రమ్ కుమార్ చెప్పిన కథకు బన్నీ ఓకే చెప్పాడని టీ టౌన్‌ వర్గాల టాక్‌.

 

యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కనుంది. అయితే ఈ ప్రాజెక్టుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే స్టైలిష్ స్టార్ కెరీర్ లో ఇదే హయ్యస్ట్ బడ్జెట్ సినిమా అవుతుంది. ఈసారి ఈ సినిమాతో తన హిట్ ట్రాక్ ని తిరిగి కొనసాగించాలి అనుకుంటున్నాడు బన్నీ.

Tags : allu arjunclassical directorDirector Vikram Kumarhighest budgetishaq.Manamnaa peru surya

Also read

Use Facebook to Comment on this Post



Menu