10/13/18 11:47 AM

ఎన్టీఆర్ ఊచకోత.. పవన్ కళ్యాణ్, చిరంజీవి రికార్డులు బద్దలు

aravinda sametha box office collections

అసలే యంగ్ టైగర్ ఎన్టీఆర్, అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఇంకేముంది.. బాక్సాఫీష్ ఊగిపోవాల్సిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. తొలిరోజే వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ భారీ యాక్షన్ చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. వాస్తవానికి విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు టికెట్లన్నీ రెండు రోజుల ముందుగానే అమ్ముడుపోయాయి. ‘అరవింద సమేత’కు తొలిరోజు కలెక్షన్లు కచ్చితంగా అదిరిపోతాయాని ముందుగానే ఊహించారు. అయితే అనుకున్నదాని కంటే భారీగా ఈ సినిమా వసూళ్లు రాబడుతోంది.

 

తొలి రోజున రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది. బాహుబలి2 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 1000కి పైగా థియేటర్లలో రిలీజైంది. తొలి రోజున అరవింద సమేత చిత్రం రూ.28.30 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ ఊపు ఇలానే కొనసాగితే ఇక వారాంతంలో కూడా మరిన్ని రికార్డులు తిరగరాసే అవకాశం లేకపోలేదు. అరవింద సమేత థియేట్రికల్ రైట్స్‌ను రూ.70 కోట్లకు అమ్మడం జరిగింది. తొలిరోజునే ఈ చిత్రం రూ.28.30 కోట్లు వసూలు చేయడంతో పెట్టుబడిలో రూ.38.05 శాతం రాబడి వచ్చేసింది. ఇటీవల నష్టాల్లో మునిగిపోతున్న డిస్టిబ్యూటర్లకు అరవింద లాభాల్ని తెచ్చిపెట్టే విధంగా ముందుకెళ్తున్నది.

 

 

ఇదిలా ఉంటే, నైజాంలో తొలిరోజు ‘అరవింద సమేత’ రూ.8.30 కోట్లు వసూలు చేసింది. దీనిలో షేర్ రూ.5.73 కోట్లు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు రమేష్ బాల ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 2018లో నైజాంలో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన రెండో చిత్రమిది (నాన్ బాహుబలి ఫిల్మ్).

 

పవన్ కల్యాణ్ నటించిన అజాతవాసి 26.36 కోట్లు, మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను రూ.21.74 కోట్లు, రాంచరణ్ నటించిన రంగస్థలం 19.49 కోట్లు, చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రం సాధించిన 22.40 కోట్ల తొలి రోజు వసూళ్లను అరవింద అధిగమించింది. రానున్న రోజుల్లో అరవింద వసూళ్లు సునామీలా ఉండవచ్చనే అభిప్రాయాన్ని ట్రేడ్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

 

అమెరికాలోనూ ఈ సినిమా సత్తా చాటింది. బుధవారం ప్రీమియర్ల ద్వారా 790,505 డాలర్లు సాధించిన అరవింద సమేత.. గురువారం 196 లోకేషన్లలో 228115 డాలర్లను వసూలు చేసింది. రెండు రోజుల్లో 7.50 కోట్లు (1,018,620డాలర్లు) వసూలు చేసింది. యూఎస్‌లో ఒక మిలియన్ డాలర్ల మార్కును దాటిన ఎన్టీఆర్ ఆరో చిత్రమిది. వరసగా ఐదో సినిమా. అంతేకాకుండా ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఎన్టీఆర్ చిత్రంగానూ ‘అరవింద సమేత’ నిలవబోతోంది.

 

ఇక ఆస్ట్రేలియాలో కూడా ఎన్టీఆర్ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతున్నది. గురువారం 35 లోకేషన్లలో రూ.67.63 లక్షలు (128,740 ఆస్ట్రేలియన్ డాలర్లు) వసూలు చేసిందని మూవీ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో ‘అరవింద సమేత’ 9వ స్థానంలో నిలిచిందన్నారు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో గురువారం కేవలం 3,678 అమెరికా డాలర్ల వసూళ్లు మాత్రమే నమోదయ్యాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా చార్ట్స్‌లో 9వ స్థానంలో నిలిచింది. ఇలా ఆస్ట్రేలియా చార్ట్‌లో తెలుగు చిత్రం నిలువడం ఓ అరుదైన రికార్డుగా చెప్పుకుంటున్నారు.

Tags : aravinda sametha boxoffice collectionsaravinda sametha record collectionscollections day oneJr.NTRtaran adarshtrivikram

Also read

Use Facebook to Comment on this Post



Menu