01/4/19 4:36 PM

బాలయ్య మజాకా.. చిరంజీవిని వెనక్కినెట్టేశాడు

Balakrishna Beat Chiranjeevi

రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. థియేటర్లలోకి రాకముందే వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన మూవీ ‘ఎన్టీఆర్’ బయోపిక్ సంచలనాలకు కేంద్రమైంది. క్రిష్ డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా ఈ మూవీ వస్తోంది. ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ అనే రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ నెల 9న ‘కథానాయకుడు’, ఫిబ్రవరి 7న ‘మహానాయకుడు’ విడుదల కానుంది. ‘కథానాయకుడు’ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హక్కులు రూ. 100 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

 

ఎన్టీఆర్ కథానాయకుడు డిజిటిల్ హక్కులు రూ.25 కోట్లకు అమ్ముడుపోయాయి. డిజిటల్ రైట్స్ విషయంలో ఇది ఓ రికార్డు. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యుత్తమం. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్‌కి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ రూ. 70 కోట్లకు అమ్ముడుపోయాయి. నైజాం హక్కులు రూ.13.5 కోట్లకు, సీడెడ్ ఏరియా హక్కులు రూ.12 కోట్లకు, ఓవర్సీస్ రైట్స్ రూ.10 కోట్లకు అమ్ముడపోయాయి. అలాగే ఉభయ గోదావరి జిల్లాల హక్కులు రూ.5 కోట్లకు కొనుగోలు చేయడం సెన్సేషన్‌గా మారింది. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి సుమారు రూ.71 కోట్ల బిజినెస్ జరిగింది. శాటిలైట్ హక్కులను రూ.25 కోట్లకు ప్రముఖ టెలివిజన్ ఛానెల్ దక్కించుకుంది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదలకు ముందే రూ.100 కోట్ల బిజినెస్ చేయడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.

 

ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. నిర్మాత రాంచరణ్ భారీ ఎత్తున ఖర్చు పెట్టి తెరకెక్కిస్తున్నాడు. అయితే సైరా సినిమా హక్కులు రూ.20 కోట్లకు అమ్ముడుపోయాయి. శాటిలైట్ హక్కుల విషయంలో చిరంజీవిపై బాలకృష్ణ సినిమా పైచేయి సాధించడం ఇదే తొలిసారి. చిరంజీవి నటిస్తున్న సైరా కంటే బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ అధికంగా బిజినెస్ చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిప్ అయ్యింది.

Tags : balakrishna cross chiranjeeviMega Star Chiranjeevinandamuri balakrishnantr biopicntr biopic satellite rightsntr kathanayakuduSye raa narasimha reddy

Also read

Use Facebook to Comment on this Post



Menu