04/8/19 4:57 PM

బన్నీ ఫ్యాన్స్‌‌కి బర్త్ డే గిఫ్ట్

birth day gift for allu arjun fans

అతడు స్టైలిష్ స్టార్.. ఇతడు మాటల మాంత్రికుడు.. ఇద్దరూ కలిస్తే కాంబినేషన్ అదిరిపోవాల్సిందే. ఇప్పటికే అది ప్రూవ్ అయ్యింది. మరోసారి భారీ హిట్ కొట్టేందుకు ఇద్దరూ రెడీ అయ్యారు. విభిన్నమైన కథ కోసం .. విలక్షణమైన పాత్ర కోసం వెయిట్ చేస్తూ వచ్చిన అల్లు అర్జున్.. త్రివిక్రమ్ వినిపించిన కథ నచ్చడంతో ఓకే చేసేశాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’ .. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో, ఈ ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అంతా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

 

ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అల్లు అర్జున్ కి ఇది 19వ సినిమా. హారిక అండ్ హాసిని .. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. ఇందులో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఇంకా సినిమాకు టైటిల్‌ ఖరారు కాలేదు.

 

మరోవైపు అల్లు అర్జున్‌ వరుస పెట్టి సినిమాలకు ఓకే చెబుతున్నాడు. బన్నీ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో బన్నీ నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఐకాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘కనబడుటలేదు’ అన్నది సబ్ క్యాప్షన్. బన్నీ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.

మరోపక్క సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ యాక్ట్ చేసే విషయం నిజమేనని సినిమా బృందం పేర్కొంది. ఇందులో కథానాయికగా రష్మిక మందనను ఎంపిక చేశారు. ‘అల్లు అర్జున్‌ 20వ చిత్రం. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తారు. సౌత్‌ సెన్సేషన్‌ రష్మిక మందన కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది’ అని పేర్కొంది. ఈ ట్వీట్‌పై రష్మిక స్పందిస్తూ..‘సో.. ఎగ్జైటెడ్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాలు వచ్చాయి.

Tags : allu arjunbirthdaybunnyGeeta Artshaarika hassine creationsstylish starsukumartrivikram

Also read

Use Facebook to Comment on this Post



Menu