01/12/19 8:09 PM

మెగా హీరోకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బాలయ్య డైరెక్టర్

Big Shock For Ram Charan

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ”వినయ విధేయ రామ” సినిమా.. సినీవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మెగా అభిమానులకు భారీ షాక్ ఇచ్చింది. మెగా హీరోకి కూడా దిమ్మతిరిగిపోయేలా చేసింది. వినయ విధేయ రామ సినిమాకు భయంకరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. కామన్ ఆడియన్స్‌దే కాదు మెగా హీరో ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశపరిచింది. ”రంగస్థలం” లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత చరణ్ చేసిన మూవీ కావడంతో వీవీఆర్‌పై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. వినయ విధేయ రామ కాదు.. వినయ విధ్వంసక రామ.. అనే టైటిల్ యాప్ట్‌గా ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

బోయపాటి బాలయ్య సినిమాల స్పెషలిస్ట్. అలాంటి డైరెక్టర్‌తో చరణ్ సినిమాకు ఓకే చెప్పడం ఏంటని? ఫ్యాన్స్ మదనపడిపోతున్నారు. అసలు చరణ్ ఏం చూసి ఈ సినిమా ఒప్పుకుని ఉంటాడని ఆరా తీస్తున్నారు. బోయపాటి సినిమాలు అంటే యాక్షన్ ఎంటర్‌టైనర్స్. రక్తపాతం, నర్కుకోవడాలు, సుమోలు పేల్చడాలు.. ఇలాంటి సీన్స్ ఉంటాయని తెలిసిందే. అలాంటి ఊర మాస్ డైరెక్టర్‌తో చరణ్ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కావడం లేదంటున్నారు. చిట్టిబాబుగా నాన్ బాహుబలి రికార్డులు తిరగరాసిన రాం చరణ్‌కు ఇలాంటి టైంలో ఈ రిజల్ట్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

 

ఫస్ట్ డే నుంచే థియేటర్లు వెలవెలబోతున్నాయి. వినయ విధేయ రామ పేరు చెబితేనే ప్రేక్షకులు బెంబేలెత్తిపోతున్నారు. వామ్మో ఆ సినిమానా? అని పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఓ రేంజ్‌లో సెటైర్లు పేలుతున్నాయి. ”బోయవాని వేటుకు గాయపడిన కోయిల.. బోయపాటి దెబ్బకు గాయపడిన కొణిదెల”.. అని ఎకసెక్కాలు ఆడుతున్నారు. వీవీఆర్ సినిమా థియేటర్లు ఎలా బోసిపోయాయో చూడండి అంటూ ఖాళీగా ఉన్న కుర్చీల ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. సంక్రాంతి సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుందని భావించిన వీవీఆర్ బొక్కబోర్లా పడింది. బోయపాటి శ్రీనుని నమ్మి చరణ్ పూర్తిగా మోసపోయాడని ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. దీని వెనుక బాలయ్య కుట్ర ఏమైనా ఉందా? అనే డౌట్ వ్యక్తం చేసే అభిమానులూ లేకపోలేదు.

 

కాగా, వీవీఆర్ సినిమా ఎఫెక్ట్ చరణ్ తర్వాతి సినిమాల మీద పడనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR మీద ఈ ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు.

Tags : balakrishnabig shock for ram charanboyapati srinufloprrrVinaya Vidheya RamaVVR

Also read

Use Facebook to Comment on this Post



Menu