06/18/19 12:24 PM

సినిమా వాళ్లనే కాదు టీవీ నటులనూ వెంటాడుతున్న ప్రమాదాలు

Car Accident, Chalaki Chanti Injured

టాలీవుడ్ హీరోలనే కాదు.. టీవీ నటులను కూడా ప్రమాదాలు వెంటాడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, షూటింగ్‌లో అపశ్రుతుల కారణంగా పలువురు యువ హీరోలు గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా హాస్య నటుడు, జబర్దస్త్ ఫేమ్ చలాకి చంటి పెద్ద ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చంటి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. చంటికి గాయాలు అయ్యాయి. వెంటనే చంటిని స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

 

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని కొమరబండ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. చంటి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాడు. చంటి పలు సినిమాల్లో హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. కమెడియన్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. మంగళవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో సూర్యాపేట జిల్లా కోదాడ కొమరబండ దగ్గర 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కాగా, గతేడాది జూన్‌ లో మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ దగ్గర జరిగిన కారు ప్రమాదం నుంచి చలాకి చంటి సురక్షితంగా బయటపడ్డాడు.

 

ఇప్పటికే టాలీవుడ్ హీరోలను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. వరుణ్ తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి సేఫ్ గా బయటపడ్డాడు. హీరోలు నాగశౌర్య, సందీప్ కిషన్.. రీసెంట్ గా శర్వానంద్.. షూటింగ్ లో గాయపడ్డారు. శర్వానంద్ పరిస్థితి దారుణంగా ఉంది. శర్వాకి 11 గంటల పాటు సర్జరీ చేశారు. 2 నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. 96 మూవీ షూటింగ్ లో శర్వాకి గాయాలు అయ్యాయి. థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. 3 రోజుల వ్యవధిలో ముగ్గురు టాలీవుడ్ యువ హీరోలు గాయపడటం కలకలం రేపింది. కొన్ని రోజుల కిందటే మెగా హీరో వరుణ్ తేజ్ కారు ప్రమాదానికి గురైంది. కారు దెబ్బ తిన్న తీరు ఆందోళన రేకెత్తించింది. అయితే వరుణ్‌తో పాటు కారులో ఉన్నవాళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Tags : Chalaki chantiinjuriesjabardasth comediankodadalorryroad accidentsharwanandtollywood heros

Also read

Use Facebook to Comment on this Post



Menu