03/12/19 11:58 AM

మీ వ్యూస్ కోసం మా హీరోలను వాడుకోవద్దు : తమ్మారెడ్డి

Chiranjeevi, Maheshbabu Good Friends, Tamma Reddy Bharadwaja

పొలిటికల్ ఎన్నికలను తలపించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా) ఎన్నికలు ముగిశాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలు వాడీవేడిగా సాగాయి. ‘మా’ ఎన్నికల హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఓటింగ్ నమోదైంది. సినీ వర్గాల్లో ఎంతో ఉత్కంఠరేపిన మా ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానల్‌పై నటుడు నరేష్ ప్యానల్ విజయం సాధించింది.

 

అయితే మా ఎన్నికలకు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చిన కథనాలు ఇండస్ట్రీ వర్గాలకు కొంత కోపం తెప్పించాయి. అలాగే బాధ కలిగించాయి. హీరోల మధ్య చిచ్చుపెట్టేలా, విభేదాలు సృష్టించేలా ఇష్టం వచ్చినట్టుగా వార్తలు ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ వ్యవహారంపై బాగా సీరియస్ అయ్యారు. యూట్యూబ్ ఛాన్సల్స్ దిగుజారుడుతనాన్ని తీవ్రంగా ఖండించారు.

 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను స్థాపించి వెన్నుదన్నుగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా మారారు. గతంలో ఆయన అండదండలతో మా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన శివాజీరాజాకు చివర్లో ట్విస్ట్ ఇచ్చి నరేష్‌కి సపోర్ట్ చేయడంతో ఆ ప్యానల్ ఘనవిజయం సాధించింది. ఇక నరేష్ ఎలాగూ సూపర్ స్టార్ క్రిష్ణ ఫ్యామిలీ కావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు.. నరేష్ ప్యానల్‌కి సపోర్ట్ చేశారు. అయితే తాము ఎవరికి మద్దతు తెలుపుతున్నామన్నది బహిరంగంగా ప్రకటించనప్పటికీ తెరవెనుక నడిచింది మాత్రం ఇదేనని ఫిల్మ్ సర్కిల్స్‌ లో జరుగుతున్న చర్చ.

 

అయితే మా ఎన్నికల్లో కీలకంగా మారిన మహేష్-చిరంజీవి వ్యవహారంపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూపించిన అత్యుత్సాహాన్ని తమ్మారెడ్డి భరద్వాజ తప్పుపట్టారు. ‘నా ఆలోచన’ అనే యూట్యూబ్ ఛానల్‌ ద్వారా సామాజిక, రాజకీయ, సినీ విషయాలపై అభిప్రాయలను తెలియజేసే తమ్మారెడ్డి తాజాగా ‘మా’ ఎన్నికలపై స్పందించారు.

 

మా ఎన్నికల్లో శివాజీ రాజా, నరేష్ ప్యానల్స్ అందరి మద్దతుని కూడగట్టినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు తప్పుదోవ పట్టించే విధంగా కథనాలు ప్రసారం చేశాయని.. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి.. శివాజీ రాజా ప్యానల్‌కి సపోర్ట్ చేశారని అలాగే మహేష్ బాబు.. నరేష్‌కి సపోర్ట్ చేశారని.. ఈ పోటీ నరేష్-శివాజీ రాజాల మధ్య కాదు.. మహేష్- చిరంజీవిల మధ్య. ఇందులో ఎవరు గెలుస్తారు’.. అంటూ యూట్యూబ్ ఛానల్ ఇష్టం వచ్చినట్టుగా వార్తలు ప్రసారం చేశారని తమ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా ఒక కుటుంబంలా ఉన్న ఇండస్ట్రీ వాతావరణాన్ని ఇలాంటి కథనాలతో ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా లేనిపోనివి కల్పిస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ఇండస్ట్రీ వాతావరణాన్ని చెడగొట్టొద్దని కోరారు.

 

‘ఇండస్ట్రీలో వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. అయితే ఇండస్ట్రీకి సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేస్తారు. ఇప్పుడే కాదు ఎప్పుడు పెద్ద హీరోలు అండగా నిలబడుతూ వస్తున్నారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. కాని ఇండస్ట్రీ అనే చాలా మంది నటీనటులకు సంబంధించినది. వాళ్లు ఎప్పుడూ ఉంటారు. కేవలం వ్యూస్ కోసం మహేష్, చిరంజీవి మధ్య ఫిట్టింగ్ పెట్టొద్దు. వాళ్ల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు.. పోటీ అంతకంటే లేదు.. వాళ్లది స్వతహాగా పోటీ పడే మనస్తత్వం కాదు. దయచేసి హీరోల మధ్య విభేదాలు పెట్టే పనులు చేయద్దు’ అని తమ్మారెడ్డి రిక్వెస్ట్ చేశారు.

Tags : chiranjeevimaa electionsmahesh babunareshsivaji rajatamma reddy bharadwajayoutube channles

Also read

Use Facebook to Comment on this Post



Menu