08/5/19 9:09 PM

వైరల్ గా మారిన మెగాస్టార్ న్యూ లుక్

Chiranjeevi New Look Goes Viral

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరక్కుతోంది. ప్రస్తుతం సైరా సందడి మొదలైంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ సినిమా కోసం చిరు రెడీ అవుతున్నాడు. కథ ప్రకారం ఈ సినిమాలో చిరు రెండు పాత్రలు పోషించనున్నాడు. అందులో ఒకటి నక్స‌లైట్ పాత్ర. ఈ పాత్ర కోసం చిరంజీవి దాదాపు 10 కిలోలకు పైగా బరువు తగ్గాడట. అందుకోసం కేరళ వెళ్లి ప్రత్యేక చికిత్స తీసుకున్నట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.

 

కాగా, మెగా కోడలు ఉపాసన తాజాగా షేర్ చేసిన చిరంజీవి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరంజీవి కళ్ళజోడు ధరించి స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. నవ యువకుడిలా ఉన్నాడని ఫ్యాన్స్ కితాబిస్తున్నారు. చిరు లుక్ అదిరిపోయిందని, పాతికేళ్లు తగ్గాయని ప్రశంసలు కురిపిస్తున్నారు. సరిగ్గా పాతికేళ్ల క్రితం చిరంజీవి ఎలా ఉండేవారో.. సరిగ్గా అలానే యంగ్‌గా కనిపిస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. చక్కగా ఒక సైడ్‌కు దువ్విన జుట్టుతో, కొద్దిగా సిగ్గు పడుతూ.. చేతికి గడియారంతో, కళ్ల జోడు పెట్టి.. బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

ఉపాసన బి పాజిటివ్ అనే మ్యాగజైన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాగజైన్ కోసం చిరు ఫోటో షూట్ లో పాల్గొన్నాడు. ఈ ఫోటో షాట్ లో చిరంజీవి చిరునవ్వు చూస్తుంటే చంటబ్బాయి సమయంలో యంగ్ చిరు గుర్తొస్తున్నాడని అభిమానులు అంటున్నారు. చిరు లుక్ సూపర్ గా ఉందని చెబుతున్నారు. కాగా, సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని అక్టోబర్ 2న రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

 

మెగా కోడలు ఉపాసన తాజాగా షేర్ చేసిన చిరంజీవి ఫొటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చిరంజీవి కళ్ళజోడు ధరించి స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశారు.

 

 

Tags : chiranjeevimegastarnew lookSye raa narasimha reddyupasana

Also read

Use Facebook to Comment on this Post



Menu