12/28/18 10:00 AM

కేటీఆర్‌ను ఆకాశానికి ఎత్తేసిన తండ్రీకొడుకులు

Chiranjeevi, Ram Charan Praises KTR

బోయపాటి శ్రీను, రాంచరణ్ కాంబోలో తెరకెక్కిన వినయ విధేయ రామ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్ యూసఫ్‌గూడలో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అంతేకాదు తన స్పీచ్‌తో మెగా ఫ్యాన్స్‌ను అలరించారు. పనిలో పనిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను కూడా ఆనందంలో ముంచెత్తారు. చరణ్‌తో తనకున్న స్నేహంతో కేటీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. గతంలో ధృవ సినిమాకు ఆయన అటెండ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి చరణ్ పిలవడంతో కాదనకుండా వచ్చేశారు.

 

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్.. కేటీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. సమర్థవంతమైన యువ నాయకుడు అని కితాబిచ్చారు. సింగిల్ హ్యాండ్‌తో పార్టీని అన్ని ఎన్నికల్లో గెలిపిస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. కేటీఆర్ పని తీరు చాలా అద్భుతంగా ఉందన్నారు. పబ్లిక్‌కు సర్వీస్ చేయాలనే కేటీఆర్ తపన అందరికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. రాజకీయ వ్యవహారాల్లో ఎంతో బిజీగా ఉంటూ కూడా తమకోసం సమయం కేటాయించి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ రాకతో నిండుదనం వచ్చిందని చిరంజీవి అన్నారు. వినయ విధేయ రాముడు ఎవరో కాదు కేటీఆరే అనిపిస్తుందన్నారు. మాటల తూటాలతో ప్రత్యర్థులను కన్‌ఫ్యూజ్ చేసే డైనమిజం మున్న లీడర్ కేటీఆర్ అని మెగాస్టార్ కితాబిచ్చారు. ఏ బాధ్యత భుజనా వేసుకున్నా దాన్ని సాధించే వరకు కేటీఆర్ నిద్రపోరు అని చిరంజీవి అన్నారు. అందుకు నిదర్శనం గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పారు. టీఆర్ఎస్ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే అందులో సింహ భాగం కేటీఆర్‌ది ఉందన్నారు. కేటీఆర్ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే డేరింగ్, డ్యాషింగ్, డైనమిక్ లీడర్ అని చిరంజీవి అభివర్ణించారు.

 

కేటీఆర్ కూడా చిరంజీవిని మాములూగా ప్రశంసించలేదు. ఓ రేంజ్‌లో మెగాస్టార్‌ గురించి చాలా గొప్పగా చెప్పారు. స్వయంకృషితో ఎదిగిన నటుడు చిరంజీవి అని కితాబిచ్చారు. బారత చలనచిత్ర పరిశ్రమలో చిరంజీవి ఒక దిగ్గజం అని, మహానటుడు అని ప్రశంసించారు. పరిశ్రమంలో సముద్రం అంత అభిమానం చూరగొనడం అసాధారణ విషయమన్నారు. చిరంజీవి ఇండస్ట్రీకి అద్భుతమైన వారసులను అందించారని చెప్పారు. అదే సమయంలో చరణ్‌ను కూడా ప్రశంసలతో ముంచెత్తారు కేటీఆర్. చిరంజీవి గారి నుంచి సంస్కారాన్ని వినయాన్ని విధేయతను అలవరుచుకుని ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన వ్యక్తిగా ఎదుగుతున్నాడరి చరణ్‌ను ప్రశంసించారు.

 

ఇక రాంచరణ్ గతంలో నటించిన రంగస్థలం సినిమాలో ‘ఆ గట్టునుంటావా? ఈ గట్టునుంటావా?’ సాంగ్‌ను తన ఎన్నికల ప్రచారంలో వినియోగించుకున్నానని, ఆ సినిమా లాగే తన ప్రసంగాలు కూడా సక్సెస్ అయ్యి.. రాష్ట్రంలో ప్రజలు తమను గెలిపించారని చెప్పారు.

Tags : chiranjeevi praises ktrjanasenaktr about pawan kalyanktr praises chiranjeevipawan kalyanram charanram charan politicstrsVinaya Vidheya Ramavinaya vidheya rama pre release eventVVR

Also read

Use Facebook to Comment on this PostMenu