12/24/18 1:01 PM

చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi To Appear As Chief Guest

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన సినిమా ‘వినయ విధేయ రామ’. క్రేజీ కాంబో కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వాని, ఆర్యన్ రాజేష్, ప్రశాంత్(జీన్స్‌ ఫేమ్) చరణ్ అన్నయ్యలుగా నటించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌ రోల్ ప్లే చేశాడు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన వినయ విధేయ రామలో స్నేహ, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

 

కాగా, వినయ విధేయ రామ ఆడియో లాంచ్ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 27న హైదరాబాద్ యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తారని సమాచారం. అదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కూడా వస్తారనే టాక్ వినిపిస్తోంది. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో ఆర్ఆర్ఆర్ అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆడియోతో పాటు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చెయ్యబోతున్నారని తెలుస్తోంది. ఇదివరకే విడుదల చేసిన టీజర్‌కీ, రెండు పాటలకీ మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీస్థాయిలో జరిగిందని సమాచారం. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags : boyapati srinuMega Star Chiranjeeviram charanVinaya Vidheya Ramavinaya vidheya rama audio launch event

Also read

Use Facebook to Comment on this Post



Menu