04/16/19 11:56 AM

6 ఫ్లాఫుల తర్వాత.. ఎట్టకేలకు హిట్ ట్రాక్ ఎక్కిన మెగా హీరో

Chitralahari Movie Box Office Collections

మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్, ‘నేను శైలజ’ దర్శకుడు కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘చిత్రలహరి’. సాయిధరమ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నటించారు. ఎన్నో అంచనాలతో శుక్రవారం(ఏప్రిల్ 12) ప్రేక్షకులకు ముందుకొచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. కాన్సెప్ట్ పాతదే అయినా దర్శకుడి ప్రతిభ, ధరమ్‌తేజ్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్లు బాగానే రాబడుతోంది.

 

సందేశంతో కూడిన ఈ ప్రేమకథా చిత్రానికి అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. బయ్యర్ల పెట్టుబడిలో 80 శాతం వెనక్కి వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా లాభాల బాట పడుతుందని అంటున్నారు. సినిమా థియేట్రికల్ రైట్స్‌ను హోల్‌సేల్‌గా రూ.13.5 కోట్లకు అమ్ముడు పోయింది.

 

తెలుగు రాష్ట్రాల్లో ‘చిత్రలహరి’కి రూ.8.5 కోట్ల షేర్ వచ్చినట్టు సమాచారం. యూఎస్ తో పాటు ఓవర్సీస్‌లో రూ.కోటి షేర్ రాబట్టింది. ఇంకో రూ.50 లక్షల వస్తే యూఎస్‌లో సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. సినిమా సక్సెస్‌కు తోడు సమ్మర్ హాలీడేస్.. కూడా ఉండడంతో ఈ సినిమా లాంగ్ రన్‌లో మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంతో మైత్రి మూవీ మేకర్స్ కూడా రెండు ఫ్లాపుల తర్వాత హిట్ అందుకున్నారు.

 

కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న సాయిధరమ్ తేజ్ కి, ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ఎంతో ఊరట కలిగిస్తోంది. తేజ్ వరుసగా ఆరు ఫ్లాపులు చూశాడు. దీంతో బాగా డీలా పడ్డాయి. లేటెస్ట్ మూవీ ‘చిత్రలహరి’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతోంది. దీంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. మొత్తానికి చాలా రోజుల తర్వాత సాయి ధరమ్ తేజ్‌కు చెప్పుకోదగ్గ హిట్ ‘చిత్రలహరి’ సక్సెస్‌తో లభించినట్లు అయ్యింది.

Tags : box office collectionschitralaharihitKishore TirumalamovieSai Dharam TejTollywood

Also read

Use Facebook to Comment on this Post



Menu