03/27/19 10:12 PM

నేరం ఇదే : కటకటాల్లోకి ప్రముఖ కొరియోగ్రాఫర్

Choreographer jani master sentenced to jail

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్ట‌ర్ కు మేడ్చల్ కోర్టు షాక్ ఇచ్చింది.  డ్యాన్స్ మాస్టర్ జానీకి జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ తో పాటు దాడి కేసులో కోర్టు 6 నెలలు జైలు శిక్ష వేసింది. 2015లో 354, 324, 506 సెక్షన్ల కింద జానీ మాస్టర్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో దోషిగా తేలడంతో జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. జానీతో పాటు మరో ఐదు మంది దోషులుగా తేలారు. వారందరిని జైలుకి తరలించారు.

 

రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోల‌కు కొరియోగ్ర‌ఫీ చేశాడు. ఖైదీ నెం. 150, రంగస్థలం, అరవింద సమేత, బాహుబలి, సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో హీరోలతో స్టెప్పులేయించాడు.

 

కేసు వివరాల్లోకి వెళ్తే.. 2015లో మేడ్చల్ మండలంలోని కండ్లకొయ్యలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో జానీ మాస్టర్ తన టీంతో పాల్గొన్నాడు. ఓ పాట విషయంలో జానీ మాస్టర్ టీమ్‌కి మరో టీమ్‌కి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో డ్యాన్స్ మాస్టర్ జానీ బృందం తమపై దాడికి పాల్పడ్డారని మరో బృందం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు జానీ మాస్టర్‌తో పాటు కోయిడ వేణు, ఘన్ శ్యామ్, వెంకటరమణ, ఎర్రోళ్ల రమేష్, ఎర్రపల్లి ప్రకాష్ ముద్దాయిలుగా చేర్చారు. 2015 నుండి మేడ్చల్‌లోని సివిల్ సీనియర్ కోర్టులో ఈ కేసు విచారణ జరగగా నేడు తీర్పు వెలువడింది. సుదీర్ఘ వాదనల అనంతరం.. దాడికి పాల్పడిన డ్యాన్స్ మాస్టర్ జానీతో పాటు కోయిడ వేణు, ఘన్ శ్యామ్, వెంకటరమణ, ఎర్రోళ్ల రమేష్, ఎర్రపల్లి ప్రకాష్ లను నిందితులుగా గుర్తించింది కోర్టు. దీంతో ఒక్కొక్కరికి 6 నెలల జైలు శిక్షతో పాటు 1500 జరిమాన విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

 

ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపర్చటం.. హ‌త్యాయ‌త్నం చేయ‌డం వంటి చర్యలు ఈ సెక్షన్ల కిందికి వస్తాయి. ఇందులో 354 సెక్షన్ కొట్టివేసిన కోర్టు.. మిగిలిన 324, 506 సెక్షన్ల కింద నేరం రుజువు కావ‌డంతో 6 నెలల జైలుశిక్ష విధించింది. చిన్నప్పటి నుండి చాలా కష్టపడ్డాడు. కూలీగా, లారీ డ్రైవర్‌గా పనిచేశాడు. 2009లో ద్రోణ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. అప్పటి నుండి వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించి పాపులర్ అయ్యాడు.

Tags : choreographer jani masterJAILmedchal courtsentenced

Also read

Use Facebook to Comment on this Post



Menu