11/15/18 10:00 AM

అందుకే అందరిముందు ముద్దు పెట్టా : వివరణ ఇచ్చిన చోటా కె నాయుడు

Chota K Naidu Kissing Kajal Agarwal

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఇది పెద్ద ఫ్యాషన్‌గా మారింది. లేడీస్‌ని పబ్లిక్‌గా అందరి ముందు కిస్ చేయడం ఆ తర్వాత అభిమానంతోనే ఇలా చేశానని వివరణ ఇచ్చి చేతులు దులుపుకోవడం. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ విషయంలో ఇదే జరిగింది. టాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్లలో ఒకడైన చోటా కె నాయుడు చేసిన పని తీవ్ర విమర్శలకు దారితీసింది. ఏకంగా స్టేజ్ మీదే అందరి ముందు చోటా కె నాయుడు కాజల్ అగర్వాల్‌ను హగ్ చేసుకోవడమే కాకుండా ముద్దు కూడా పెట్టాడు. ‘కవచం’ సినిమా టీజర్ లాంచ్‌లో చోటా చేసిన ఓవరాక్షన్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

 

సినీ తారలు ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఒకరినొకరు మర్యాదపూర్వకంగా పలకరించుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ఎదుటి వ్యక్తిని హగ్ చేసుకుంటూ ఉంటారు. అంతవరకు ఎలాంటి తప్పు లేదు. కానీ ఏకంగా ముద్దు పెట్టడం అదీ పబ్లిక్ ప్లేస్‌లో. చోటా చేసిన పనికి కాజల్‌తో పాటు అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీడియా ముందు ఇలాంటి పనులు చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ చోటా ఆ లిమిట్స్‌ను క్రాస్ చేశాడనే విమర్శలు వెల్లువెత్తాయి.
టాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్లలో చోటా కె నాయుడు ఒకడు. ఆయన కెమెరా వర్క్‌కి పరిశ్రమలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వయసు ఎంత పెరుగుతున్నా నిత్యం ఉత్సాహంగా కనిపిస్తుంటాడు. అలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి ఇలా చీప్‌గా బిహేవ్ చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
చోటా చేసిన పని పెద్ద దుమారమే రేపింది. చోటా ప్రవర్తన ఎంతమాత్రం సరికాదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గ‌తంలోనూ ప‌లు సంద‌ర్భాల‌లో చోటా కె నాయుడు హీరోయిన్స్‌తో అస‌భ్యంగా మాట్లాడాడని చెబుతూ చోటాకి సంబంధించిన పలు వీడియోలను నెట్‌లో పోస్ట్ చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. అతడిన సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలనే డిమాండ్లు కూడా చేస్తున్నారు. దీంతో అలర్ట్ అయిన చోటా కె నాయుడు వివరణ ఇచ్చుకున్నాడు.

 

సౌంద‌ర్య త‌ర్వాత తాను అంత‌గా అభిమానించే హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ అని, ఆమెతో చాలా సినిమాలు చేశానని, ఆమె నటన అంటే తనకు ఎంతో ఇష్టం అని, ఆమె నటనను అభినందిస్తూ ఆమెకు ముద్దు పెట్టాననీ, అంతకుమించి ఆ ముద్దుకు ఎంతమాత్రం ప్రాధాన్యత లేదని చోటా వివరించాడు. కాజల్ అగర్వాల్ తనని కుటుంబ సభ్యుడిలాగే భావిస్తుందని, మా ఇద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉందని చెబుతూ కాజల్‌కు ముద్దు పెట్టడాన్ని సమర్థించుకున్నాడు చోటా. తను తప్పుగా ప్రవర్తించలేదని, సంతోషంగా ముద్దుపెట్టుకున్నానని తెలిపాడు.

 

మొత్తంగా ఈ వివాదం విషయంలో చోటా కె నాయుడు దివంగత నటి సౌందర్య పేరు చెప్పి ఎమోషనల్‌గా వివరణ ఇచ్చాడు. మరి నెటిజన్లు చోటా ఇచ్చిన వివరణకు చల్లబడుతారా లేదా అనేది చూడాలి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా న‌టించిన క‌వ‌చం చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్, మోహ్రీన్ న‌టించారు.

 

ప్రస్తుతం దేశంలో మీటూ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న ద‌శ‌లో ఇన్నాళ్ళు పెద్ద మ‌నుషులుగా ఉన్న కొంద‌రి చీక‌టి కోణాలు ఒక్కొక్క‌టి వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో చోటా కె నాయుడు చేసిన చీప్ పని విమర్శలకు దారితీసింది. అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ.. ఇలా బరితెగించి ప్రవర్తించి.. దానికి అభిమానం అనే ముసుగు తొడగడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags : Chota k naiduchota k naidu kiss kajal agarwalchota k naidu kissing kajalkavacham teaser launchmeetoo

Also read

Use Facebook to Comment on this PostMenu