01/8/19 1:15 PM

పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు : ‘పేట’ నిర్మాతకు దిల్ రాజు వార్నింగ్

Dir Raju Strong Couter To Vallabhaneni Ashok

తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ మాఫియా నడుస్తోందని, కొందరు నిర్మాతలు మాఫియాగా ఏర్పడి థియేటర్లను తమ గుప్పిల్లో ఉంచుకున్నారని.. దిల్ రాజు, అల్లు అరవింద్, యూవి క్రియేషన్స్ వారు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించడంతో పాటు.. కుక్కలు, షూట్ చేయాలి అంటూ రజనీకాంత్ ‘పేట’ నిర్మాత వల్లభనేని అశోక్ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో కలకలం రేపాయి. అశోక్ చేసిన వ్యాఖ్యలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. అశోక్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. సోమవారం సాయంత్రం ఎఫ్ 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజు.. నిర్మాత అశోక్ చేసిన కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించారు. తెలుగు సినిమాలకే థియేటర్స్ దొరకడం లేదు.. తమిళ సినిమాలకు థియేటర్స్ ఎక్కడ నుండి వస్తాయని దిల్ రాజు ప్రశ్నించారు. టంగ్ స్లిప్ అయ్యి.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే.. మంచిది కాదని హితవు పలికారు.

 

సినిమా ప్రకటన నుంచి రిలీజ్ డేట్స్ వరకు ఇండస్ట్రీలో ఎప్పుడేం జరుగుతుందో మాతో పాటు మీడియా వారికి అన్నీ తెలుస్తాయని దిల్ రాజు అన్నారు. సంక్రాంతికి వచ్చే మూడు సినిమాలు (ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్ 2) 6 నెలల ముందుగానే విడుదల తేదీని ప్రకటించాయని గుర్తు చేశారు. ఆర్నెళ్లక్రితం రిలీజ్ డేట్ చేసి ఈ మూడు పెద్ద సినిమాలకు థియేటర్స్ ఎలా సర్దుబాటు చేసుకోవాలా అని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బందులు పడుతుంటే.. 15 రోజుల క్రితం ‘పేట’ తమిళ సినిమాను కొనుక్కుని సంక్రాంతికి రిలీజ్ అంటూ అనౌన్స్ చేసేయడం ఎంతవరకు కరెక్ట్ అని దిల్ రాజు నిలదీశారు. మూడు పెద్ద సినిమాలు విడుదల ఉన్నప్పుడు పక్కరాష్ట్రం నుండి వచ్చే సినిమాకి థియేటర్స్ ఎలా అడ్జస్ట్ అవుతాయని ప్రశ్నించారు. ఈ నాలుగు నెలల్లో మూడు డబ్బింగ్ సినిమాలను అశోక్ విడుదల చేశాడని దిల్ రాజు గుర్తు చేశారు. నవాబ్, సర్కార్, ఇప్పుడు పేట.. మణిరత్నం సర్కార్ సినిమాకు కావాల్సినన్ని థియేటర్స్‌లో విడుదల చేసుకున్న విషయం గుర్తు లేదా? అని అడిగారు. అప్పుడు రాని థియేటర్స్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఎందుకు వచ్చిందని మండిపడ్డారు.

 

ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, ఎఫ్2…ఈ మూడు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన భారీ బడ్జెట్, ప్రతిష్టాత్మక చిత్రాలని, తెలుగు సినిమాలను తగ్గించుకుని ఆ సినిమాకు థియేటర్లు ఇవ్వలేమని, ఈ సీజన్‌లో తెలుగు సినిమాకు తప్ప వేరే సినిమాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదని దిల్ రాజు స్పష్టం చేశారు.

 

‘పేట’ సినిమాని 18వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పిన అశోక్.. ఇప్పుడెందుకు మాట మార్చారని దిల్ రాజ్ నిలదీశారు. 18వ తేదీనే విడుదల చేస్తే రెండు రాష్ట్రాల్లో కావాల్సినన్ని థియేటర్లు దొరికేవి కదా అని చెప్పారు. ఇలాంటివి ఆలోచించకుండా వివాదాస్పదన వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ”అశోక్ టంగ్ స్లిప్ అయి పిచ్చి పిచ్చి మాటలు అన్నాడు. నేను కూడా మాట్లాడగలను. కానీ నాకొక క్యారెక్టర్ ఉంది. ఇక్కడ మనం చేస్తుంది వ్యాపారం. ఆయన సినిమా కొనుగోలు చేసింది కూడా వ్యాపారం కోసమే. మేము మంచి సినిమాలు చేసేది కూడా ప్రేక్షకుల దగ్గర నుంచి డబ్బు తెచ్చుకోవడానికే” అని దిల్ రాజు అన్నారు.

 

లాస్టియర్ డిస్ట్రిబ్యూషన్‌లో నేను చాలా లాస్ అయ్యానని దిల్ రాజు వాపోయారు. అయినా సినిమా మీద ఉన్న ప్రేమతో సొంత ప్రొడక్షన్‌లో సినిమాలు తీస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు వస్తున్న మూడు సినిమాలు భారీ బడ్జెట్‌, ప్రెస్టేజియస్ మూవీస్ అని, ఈ సినిమాలకు థియేటర్స్ లేకుండా అనువాద సినిమాలకు థియేటర్స్ కావాలంటే అది తప్పా.. రైటా అనేది మీడియానే నిర్ణయించి సపోర్ట్ చేయాలని దిల్ రాజు కోరారు.

 

రజనీకాంత్ ‘పేట’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత వల్లభనేని అశోక్… ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పేట సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అల్లు అరవింద్, దిల్ రాజు, యువీ క్రియేషన్స్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే దిల్ రాజ్ మాత్రం అశోక్‌లా తన స్థాయిని దిగజార్చుకోకుండా హుందాగా మాట్లాడారని ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసించాయి.

Tags : dil raju counter to vallabhaneni ashokdilr rajuf2 moviepetta movietheatre mafiatheatres

Also read

Use Facebook to Comment on this PostMenu