Ad

03/13/18 7:46 PM

అర్జున్ రెడ్డి కూడా ఆదులేకపోయాడు..!

Untitled-1 copy

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయిన హీరో విజయ్ దేవరకొండ. అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో విజయ్ చేసిన సినిమా ‘ఏ మంత్రం వేసావె’. ఇటీవల ఆ సినిమా విడుదలైంది. విజయ్ ఎప్పుడో చేసిన ఈ సినిమాకి ఎటువంటి కలెక్షన్లు రావడం లేదు. అర్జున్ రెడ్డి వంటి హిట్ సినిమా తర్వాత విడుదలైనా సరైన రెస్పాన్స్ లేదు.

 

వాస్తవానికి ఈ సినిమా విడుదల అవటం హీరో విజయ్ దేవరకొండకి కూడా ఇష్టం లేదు. ఇందుమూలంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. అంతేకాకుండా ఈ సినిమా విడుదలైన రోజే నోటా అంటూ కొత్త సినిమా మొదలుపెట్టి అటెన్షన్‌ అటు డైవర్ట్‌ చేసాడు. అయితే అతనెంత కాదన్నా ఇది తన ఖాతాలో ఒక ఫ్లాప్‌ గానే మిగిలిపోతుంది.

 

ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న ఈ సమయంలో ఎప్పుడో చేసిన ‘ఏ మంత్రం వేసావె’ సినిమా విడుదల చేయవద్దని సదరు నిర్మాతతో చెప్పారట విజయ్ దేవరకొండ. అంతేకాకుండా ఆ నిర్మాతకి ఇంకో సినిమా చేసి పెడతానని కూడా చెప్పాడట. అయితే ఆ నిర్మాత మాత్రం విజయ్ దేవరకొండ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికే మొగ్గు చూపాడు. సినిమాను విడుదల చేయవద్దని విజయ్ ఎంత మొత్తుకున్నా వినలేదు ఆ నిర్మాత.

Tags : Arjun reddyflopnotavijay devarakondaVijay Deverakondaye mantram vesave

Also read

Use Facebook to Comment on this Post



Menu