01/22/19 8:20 PM

సంక్రాంతి విజేత : ఎఫ్ 2 వసూళ్ల సునామీ

F2 Movie Box Office Collections

సినిమాల్లో మ్యాటర్, కంటెంట్ ఉండాలే కానీ.. ఎలాంటి మూవీ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? డైరెక్టర్ ఎవరు? ఇలాంటివేవీ పట్టించుకోరు. మూవీ బాగుందంటే కచ్చితంగా చూస్తారు. ఈ విషయం అనేకసార్లు ప్రూవ్ అయ్యింది. తాజాగా టాలీవుడ్‌లో మరోసారి అదే జరిగింది.

 

సంక్రాంతి రేసులో వచ్చిన సినిమాల్లో మల్టీస్టారర్ మూవీ ఎఫ్ 2(ఫన్ అండ్ ప్రస్టేషన్) బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. సీనియర్ హీరో వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ మల్టీస్టారర్ కాసుల వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది.

 

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ఎఫ్ 2’ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజైన్ ప్రతి ప్రాంతం నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ల విషయంలో పాత రికార్డులను చెరిపేస్తూ కొత్త రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తోంది.

 

ఒక్క నైజామ్‌లోనే ఈ సినిమా నిన్నటితో కలుపుకుని 16 కోట్ల షేర్‌ను రాబట్టింది. త్వరలోనే 20 కోట్ల షేర్ మార్క్‌ను అందుకోవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 70కోట్ల గ్రాస్‌ను .. 47 కోట్ల షేర్‌ను ఈ సినిమా రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా నిన్నటితో 90కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. మరికొన్ని రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమనేది ట్రేడ్ పండితుల అంచనా. ఏదేమైనా, కామెడీ కంటెంట్‌కి తిరుగులేదనే విషయాన్ని ఈ సినిమా మరోమారు నిరూపించింది.

 

సంక్రాంతి రేసులో రామ్ చరణ్ వినయ విధేయ రామ, రజనీకాంత్ పేట, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు కూడా వచ్చాయి. కానీ అవన్నీ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి. డిస్ట్రిబ్యూటర్లకు బారీగా నష్టాలు మిగిల్చాయి. కామెడీ కంటెంట్‌తో వచ్చిన ఒక్క ఎఫ్-2 సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్‌గా నిలిచి కాసుల వర్షం కురిపిస్తోంది. మొత్తానికి టాలీవుడ్‌లో ఈ సంక్రాంతి ఒక్క హిట్.. మూడు డిజాస్టర్లుగా నిలిచిపోయింది.

Tags : f2 movie box office collectionsf2 telugu movientr kathanayakuduVarun TejvenkateshVinaya Vidheya Rama

Also read

Use Facebook to Comment on this Post



Menu